బొండా ఉమా ఫిర్యాదు: బెజవాడ పారిశ్రామికవేత్తపై హత్యాయత్నం కేసు!

అమరావతి: బెజవాడ డుండీ గణేష్ సేవా సమితిలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. డుండీ గణేష్ సేవా సమితి మీద ఆధిపత్యం కోసం టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం వర్గాల మధ్య మొదలైన వివాదం చివరకు చినికి చినికి గాలివానగా మారింది.

బెజవాడలో అగ్గిరాజేసిన గణేష్ ఉత్సవం: లైవ్‌లో తిట్టుకున్న బొండా ఉమ, కోగంటి సత్యం

డుండీ గణేశ్ సేవా సమితి గౌరవ అధ్యక్ష పదవి నుంచి కోగంటి సత్యాన్ని తొలగించి, ఆ పదవిలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కట్టబెడుతూ కమిటీ రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన బొండా ఉమా కమిటీ కార్యకలాపాలకు అడ్డొస్తే ఎవరినైనా జైలుకు పంపుతానంటూ హెచ్చరించారు.

Koganti Satyam Arrested over Dundi Ganesh Utsav Arrangements Controversy

గతేడాది సేకరించిన వారాళాల్లో రూ. 30 లక్షలను కోగంటి సత్యం స్వాహా చేశారని బొండా ఉమా ఆరోపిస్తున్నారు. అంతేకాదు డుండీ గణేష్ సేవా సమితిలో జరిగిన అవకతవకలపై కోగంటి సత్యంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో కోగంటి సత్యం వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఉమా వర్గానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాకేష్ ఫిర్యాదు మేరకు కోగంటి సత్యాన్ని విచారణకు పిలిపించిన సూర్యారావుపేట పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోగంటిపై హత్యాయత్నం ఆరోపణల కింద ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదైంది. తనను కోగంటి చంపబోయారంటూ బొండా ఉమా వర్గం ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

డుండీ గణేశ్ సేవా సమితిలో జరిగిన అవకతవకలపై సత్యంను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. సత్యం అరెస్ట్ విషయం తెలిసిన ఆయన వర్గీయులు వెంటనే పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అటు బోండా ఉమా వర్గీయులు కూడా పోలీసు స్టేషన్ వద్ద మోహరించారు. దీంతో ఒక్కసారిగా బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి.

బొండా ఉమా, కోగంటి సత్యం వర్గీయుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడం, ఈ వ్యవహారం అరెస్టుల వరకు వెళ్లడంతో అసలు ఈసారి డుండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు సక్రమంగా సాగుతాయా లేదా అన్న అనుమానాలు బెజవాడ వాసుల్లో తలెత్తుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+