గుంటూరులో కలకలం: రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్‌కు నిప్పు, అక్కడే మద్యం బాటిళ్లు, జెండాలు

Subscribe to Oneindia Telugu

గుంటూరు: జిల్లాలోని తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్‌కు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో టికెట్ కౌంటర్, కంప్యూటరర్లు, ఫర్నీచర్, ఇతర ఆఫీసు సామాగ్రి కాలిబూడదయ్యాయి.

సోమవారం రాత్రి కొలకలూరు రైల్వే స్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కౌంటర్‌లోని కంప్యూటర్, రికార్డులు, ఫర్నిచర్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి.

kolakaluru railway station ticket counter on fire

కాగా ఘటనాస్థలిలో ఎమ్మార్పీఎస్‌ జెండాలు, మద్యం బాటిళ్లు లభ్యమవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మంగళవారం ఉదయం ఈ ఘటన గమనించిన రైల్వే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.

అయితే, కొలకలూరు రైల్వే స్టేషన్‌లో కొన్ని ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఈ క్రమంలోనే రైల్వే సిబ్బంది కూడా ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే స్టేషన్లో ఉంటారని తెలిసింది. సీసీ కెమెరాలు గానీ, సెక్యూరిటీ సిబ్బంది గానీ లేకపోవడంతో స్టేషన్ ఆవరణలో కొందరు దుండగులు మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that some thugs set ablaze to ticket counter in kolakaluri railway station on Monday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి