కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులోనే ఎస్పీ మకాం: గంగిరెడ్డి వెనక ఉన్నదెవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి వెనక ఉన్నదెవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మారిషస్ నుంచి గంగిరెడ్డిని హైదరాబాదు తరలించిన విషయం తెలిసిందే. ఆయనను ఎలాగైనా కర్నూలు తీసుకురావాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా ఎస్పి రవికృష్ణ హైదరాబాదులోనే మకాం వేసినట్లు తెలుస్తోంది.

గంగిరెడ్డి కస్టడీకి తీసుకుని అతనికి సహకరించిన వివరాలు రాబట్టాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. మారిషస్‌ నుంచి గంగిరెడ్డిని తెచ్చిన తర్వాత మొదట కర్నూలుకే తీసుకుని వస్తారని జిల్లా పోలీసులు అనుకున్నారు. అయితే కడప జిల్లా ప్రొద్దుటూరు లో ఓ హత్యకేసులో ఇంకా శిక్ష అనుభవించా ల్సి ఉండటంతో దానికి ప్రాధాన్యం ఇచ్చి గంగిరెడ్డిని అక్కడి కోర్టులో హాజరు పరిచారు.

వెల్దుర్తి వద్ద దొరికిన ఎర్రచందనం డంప్‌ కేసులో సబ్‌జైలులో ఉంటూ హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చిన గంగిరెడ్డి ఆ తర్వాత పరారయ్యాడు. దాంతో కర్నూలు జిల్లా డోన్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆ వారెంటు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.

అదే విధంగా ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో దొరికిన ఎర్రచందనం దుంగల కేసులో కూడా గంగిరెడ్డి పదో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో కూడా నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ అమలులో ఉంది. ఈ రెండు వారెంట్లతో గంగిరెడ్డిని ఆళ్లగడ్డ, డోన్‌ కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. దీంతో కర్నూలు జిల్లా పోలీసులు గంగిరెడ్డి కస్టడీ కోసం నేడో, రేపో పిటిషన్‌ దాఖలు చేసే అవ కాశం ఉంది.

 Kollam gangi Reddy episode: who are behind him?

ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి మారిషస్‌లో ఉండగా అక్కడి న్యాయ సాయం కోసం ఖర్చుచేసిన నేతలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కర్నూలు, నంద్యాల, హైదరాబాద్‌కు చెందిన కొంతమంది న్యాయవాదులు నంద్యాల ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖుడి ఆ దేశాలతో ప్రతిసారీ మారిషస్‌వెళ్లి గంగిరెడ్డి తరుపున వాదనలు వినిపించినట్లు సమాచారం. ఇందుకోసం ఫీజుల రూపంలో గంగిరెడ్డి చెల్లించినట్లు తెలిసింది.

గంగిరెడ్డి జైలులో ఉండడంతో పాటు అతడి బ్యాంకు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు పోలీసులు స్తంభింపజేసిన నేపథ్యంలో అతనికి అంత మొత్తంలో ఆర్థిక సాయం అందించింది ఎవరు? అంత పెద్దమొత్తంలో గంగిరెడ్డి కోసం ఖర్చు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమే మిటి? గతంలో వీరికి, గంగిరెడ్డికి మధ్య వ్యా పార సంబంధాలు ఉన్నాయా? అనే కోణం లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దొరికిన ఎర్రదుంగల కేసులో చాగలమర్రి ఎంపీపీ మస్తాన్‌వలీ, గంగిరెడ్డి నిందితులుగా ఉన్నారు. మస్తాన్‌వలీ కూడా పలు సార్లు గం గిరెడ్డిపై ప్రస్తావన తీసుకవచ్చారు. వెల్దుర్తి దగ్గర దొరికిన డంప్‌లో డైరీ ఆధారంగా పలు వివరాలు అప్పట్లో వెలుగులోకి వచ్చా యి.

English summary
Kurnool Police are trying to know the the persons behind Red Sanders smuggler Kollam gangi Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X