మళ్లీ కొల్లేరు ఆపరేషన్ ? సుప్రీంకోర్టులో సర్కార్ హింట్..!

ఏపీలో ఒకప్పుడు స్వదేశీ, విదేశీ పక్షులతో కళకళలాడిన కొల్లేరు సరస్సు ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఉండే వ్యాపారుల దురాశతో ఆక్రమణలకు గురై మురికి కూపంగా మారిపోయింది. దీంతో కొల్లేరులోకి వెళ్లే వాగులు, వంకల నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి వరదలకు కూడా కారణమవుతోంది. దీంతో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పటి వైఎస్ ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ పేరుతో భారీ ఎత్తున ఆక్రమణల్ని తొలగించింది. అప్పట్లో పెను సంచలనం రేపిన ఈ ఆపరేషన్ ను ఇప్పుడు మరోసారి చేపట్టబోతోంది.

kolleru lake operation again to draw boundaries soon ap government informed to supreme court

కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి. దీనిపై తాజాగా గత డిసెంబర్ లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. వీటి ఆధారంగా ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో చర్యలు చేపట్టింది. వీటి వివరాలను ఇవాళ జరిగిన విచారణలో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం వివరించింది. ప్రస్తుతం చేపడుతున్న చర్యల ఆధారంగా కొల్లేరు సరస్సు సరిహద్దుల్ని మూడు నెలల్లో తేలుస్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అదే సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొల్లేరు సరిహద్దుల ఖరారుకు తీసుకున్న చర్యలు కూడా సుప్రీంకోర్టుకు వివరించింది. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ కొల్లేరులో దాదాపు 5 వేల ఆక్రమణలు తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన ఆక్రమణల్ని కూడా తొలగించి కొల్లేరు సరిహద్దుల్ని తేలుస్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. అయితే ఆలోపు కార్యాచరణ పురోగతితో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+