ఐటీ సంస్థల్లో లోకేష్ నిర్ణయం, తప్పేమిటి: జగన్‌కు సూటి ప్రశ్న
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ను మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా నియమించడంపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
గుంటూరు: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ను మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా నియమించడంపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. వైసిపికి మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.
భూకేటాయింపులకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘంలో లోకేష్‌ను సభ్యుడిగా నియమించడంలో తప్పేముందని ప్రశ్నించారు. మంత్రివర్గం సభ్యుడిగా అన్ని సంబంధిత కమిటీల్లో ఉండే ఆర్హత ఆయనకు ఉందన్నారు.

రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వస్తున్నాయని, ఆయా సంస్థలకు భూ కేటాయింపుల విషయంలో ఆ శాఖ మంత్రిగా నారా లోకేష్ కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఈ అంశంపై ప్రతిపక్షాలు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నాయని కొల్లు విమర్శించారు. ఇప్పటికైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాష్ట్రాభివృద్ధికి కలసి రావాలన్నారు.












Click it and Unblock the Notifications