నిరూపిస్తావా?.. రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి రెడీ: జగన్‌‍కు టీడీపీ ఎమ్మెల్యే సవాల్

అమరావతి: తన నియోజకవర్గంలో అవినీతి జరుగుతోందని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ వైసీపీఅధినేత జగన్‌కు సవాల్ విసిరారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి సన్నిధిలో అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్దమని, బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అభవృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని.. జగన్‌ లాగా కుట్రపూరిత రాజకీయాలు చేయట్లేదని అన్నారు. జగన్ చూడటానికి చిన్న వ్యక్తిలా కనిపించినా.. నిలువెల్లా విషమే ఉందని మండిపడ్డారు. జగన్ తన పాదయాత్రల్లో తనపై లేని పోని ఆరోపణలు చేశారని అన్నారు.

kommalapati sridhar challenges jagan to prove corruption allegations

ఇసుక రీచ్‌ల్లో అవినీతికి పాల్పడ్డానని జగన్‌ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలే అన్నారు. ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేసేలా వ్యవహరించడం జగన్‌కు అలవాటే అన్నారు.

కాగా, ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పెదకూరపాడులో పర్యటించిన జగన్.. స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈమధ్యే 'ఎమ్మెల్యే' అని ఓ తెలుగు సినిమా విడుదలైందని, అక్కడ దానికి అర్థం మంచి లక్షణాలున్న అబ్బాయి అని, కానీ పెదకూరపాడులో మాత్రం 'మామూళ్లు లంచాలు తీసుకునే అబ్బాయ్' అని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+