వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలశౌరి పై కొనకళ్ల ఆగ్రహం - పేర్ని నానికి రిలీఫ్ : రాజకీయ ప్రత్యర్ధంటూ..!!

|
Google Oneindia TeluguNews

మచిలీపట్నం వైసీపీ నేతల పంచాయితీలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని పైర్ అయిన సొంత పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి టీడీపీ నుంచి రియాక్షన్ వచ్చింది. మాజీ మంత్రి పేర్ని నాని పై ఎంపీ బాలశౌరి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మచిలీపట్నం డెవలప్ మెంట్ కోసం ఏ పనికి నాని సహకరించలేదని చెప్పుకొచ్చారు. తాను బెదిరింపులకు భయపడనని.. ఇక నుంచి మచిలీపట్నంలోనే ఉంటానని తేల్చి చెప్పారు. దీని పైన పేర్ని నాని స్పందించలేదు. వెంటనే జోక్యం చేసుకున్న పార్టీ అధినాయకత్వం ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని సూచించింది.

దీంతో.. పేర్ని నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో పేర్ని నాని మాజీ ఎంపీ సుజనా చౌదరి.. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో సత్సంబంధాలు ఉన్నాయని..వారితో ఏంటి పని అంటూ ప్రశ్నించారు. దీని పైన టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల రియాక్ట్ అయ్యారు. బాలశౌరి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ ఆధారంతో పేర్ని నానికి, తనకు సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి ఆరోపించాడో సమాధానం చెప్పాలని కొనకళ్ల డిమాండ్ చేశారు. పేర్ని నాని తనకు ఓ రాజకీయ ప్రత్యర్థి అని, ఆయనొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, నేనొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానన్నారు.

Konakalla NArayana seriously reacted on MP Balasowri comments against him

బాలశౌరి ఏ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని.. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని.. నిబద్దతో రాజకీయాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తనపై నిరాధార వ్యాఖ్యలు చేసిన బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పేర్ని నాని వైసీపీ నేతగా ఉన్నారని..తాను టీడీపీలో ఉంటే తమకు ఏం సంబంధాలు ఉంటాయని ప్రశ్నించారు. ఒక పాఠశాల కార్యక్రమంలో డొనేషన్ ఇవ్వటంతో కలిసామని..రాజకీయాలకు దానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు దీని పైన బాలశౌరి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

English summary
TDP ex MP Konakalla Narayana Reacted on YCP MP Balasowri comments on comments against him in Perni Nani episode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X