రణసీమగా కోనసీమ.. మరోమారు ఆందోళనలకు పిలుపునిచ్చిన జేఏసీ; కర్ఫ్యూ విధించిన పోలీసులు

ప్రశాంతంగా ఉండే కోనసీమ రణసీమగా మారింది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. మంత్రి ఇల్లు తగలబెట్టే దాకా, ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేదాకా, పోలీసులను గాయాలపాలు చేసే దాకా వెళ్ళింది. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దు అంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం ఊహించని పరిణామం.

కోనసీమలో ఉద్రిక్తత..రాజకీయ రగడ

కోనసీమలో ఉద్రిక్తత..రాజకీయ రగడ

కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ ఒక్కసారిగా గుంపులుగా వచ్చిన ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టడం ఆందోళనల తీవ్రతను తెలియజేస్తోంది. అలాగే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి చేయడం, పోలీసులపై కూడా దాడికి దిగడం ఉద్రిక్తతకు అద్దం పడుతుంది. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దు అంటూ మొదలైన ఆందోళనలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయి. దీని వెనుక టిడిపి, జనసేన హస్తం ఉందని ఏకంగా హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ మంత్రులు, నేతలు దీనిని ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించారు. ఇక తమపై వచ్చిన ఆరోపణలపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

మరోమారు నిరసనకు పిలుపునిచ్చిన కోనసీమ సాధనా సమితి

మరోమారు నిరసనకు పిలుపునిచ్చిన కోనసీమ సాధనా సమితి


ఇదిలా ఉంటే కోనసీమ జిల్లా మార్పుపై అమలాపురంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉంటే కోనసీమ సాధన సమితి బుధవారం మరో నిరసనకు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన వద్దకు భారీగా ప్రజలు చేరుకోవాలని నిరసన చేపట్టాలని పేర్కొంది. ఇక ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న అమలాపురంలో తాజాగా కోనసీమ సాధన సమితి మరోమారు ఆందోళనలకు పిలుపునివ్వడం తో ఈ రోజు ఏం జరుగుతుంది అన్న తీవ్ర ఉత్కంఠ వ్యక్తమౌతుంది.

కోనసీమలో నేటి నుండి కర్ఫ్యూ .. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు యత్నం

కోనసీమలో నేటి నుండి కర్ఫ్యూ .. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు యత్నం

తాజా పరిస్థితుల నేపథ్యంలో కోనసీమ ప్రాంతంలో ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకురావడానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి జిల్లాకు అదనపు బలగాలను పంపి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చెయ్యాలని హోం మంత్రి తానేటి వనిత అధికారులకు ఆదేశించారు. కోనసీమ వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేయాలని కలెక్టర్ నిర్ణయించడంతో, నేటి నుండి కర్ఫ్యూ అమలు కానుంది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ కర్ఫ్యూ అమలు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు... వద్దంటూ ఆందోళనలు.. ఉద్రిక్తత

కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు... వద్దంటూ ఆందోళనలు.. ఉద్రిక్తత

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లో భాగంగా కోనసీమ జిల్లా ఏర్పాటు జరిగింది. అయితే కోనసీమ జిల్లాను, బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కోనసీమ జిల్లాకు బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని కోన సీమ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోనసీమనే ముద్దు మరే పేరు వద్దు అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి పేరుతో ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే మంత్రి పినిపే విశ్వరూప్ ఇల్లు తగలబెట్టడంతో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కోనసీమ జిల్లా చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+