టిఆర్ఎస్‌ వైపు కొండా దంపతుల చూపు: టికెట్‌‌కు ఓకె

Konda Surekha and Konda Murali likely to join in TRS
హైదరాబాద్/వరంగల్: మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళీ ధర రావు దంపతులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఏ పార్టీలో చేరాలన్నదానిపై తీవ్ర తర్జనాభర్జనలు పడిన కొండా దంపతులు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ విషయంపై టిఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావుతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కొండా సురేఖకు వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు టిఆర్ఎస్ నాయకులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కొండా మురళీకి స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేందుకు కూడా టిఆర్ఎస్ నాయకులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టిఆర్ఎస్‌కు బలమైన అభ్యర్థి లేకపోవడం.. ఆ నియోజకవర్గంలో కొండా సురేఖకు మంచి ఆదరణ ఉండటంతో సురేఖకు ఆ టికెట్ ఇచ్చేందుకు టిఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులు చేరారు.

ఆ తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో తీసుకోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడంతో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వారు కాంగ్రెస్‌ను వీడేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియమితులు కావడం కూడా కారణంగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+