టిఆర్ఎస్‌తోనే బంగారు టి, విలీనంతో మారదు: కొండా

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఒక్క టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని.. అందుకే ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన పుట్టిన రోజున తెలంగాణ ఇస్తామని చెప్పి మూడు సంవత్సరాలు సాగదీశారని ఆరోపించారు. దీంతో తెలంగాణ రాదేమోనని అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కొండా సురేఖ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వస్తుందని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పిన కెసిఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కొండా సురేఖ చెప్పారు. కెసిఆర్, టిఆర్ఎస్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ చేయకూడదని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో వంద సంవత్సరాలైనా తెలంగాణ ఇలాగే ఉంటుందని అన్నారు.
తెలంగాణకు ఏ రకమైన అన్యాయం జరిగిన కెసిఆర్ నిలదీస్తారని ఆమె చెప్పారు. తాను వేరే పార్టీలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు రాజకీయ పరమైనవే కానీ వ్యక్తిగత మైనవి కావని, వాటన్నింటినీ తాను ఉపసంహరించుకుంటున్నట్లు కొండా సురేఖ చెప్పారు. టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినందుకు ఆమె కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుతామని కొండా సురేఖ చెప్పారు. తాము పదవుల కోసం పార్టీలో చేరలేదని, పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహించేందుకు తాము సిద్ధమని కొండా తెలిపారు.












Click it and Unblock the Notifications