విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు కొండా సురేఖ షాక్-వైఎస్ తోనే అనుబంధం-కుటుంబంతో కాదు-బెజవాడలో కొండా ప్రమోషన్

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ.. ఆయన మరణం తర్వాత దాదాపు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. వైఎస్ జగన్ సీఎం అయ్యేందుకు సంతకాలు పెట్డడంతో పాటు వైఎస్ మరణం తర్వాత ఆయనకు అండగా నిలిచిన సురేఖ.. మానుకొండలో జగన్ ఓదార్పుయాత్రకు కూడా తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సహకరించారు. ఆ తర్వాత జగన్ వైఖరితో ఆయనకు దూరమైన కొండా సురేఖ.. ఇవాళ విజయవాడ టూర్ కు వచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

విజయవాడలో కొండా సురేఖ

విజయవాడలో కొండా సురేఖ


ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కొండా సురేఖ ఇవాళ విజయవాడ వచ్చారు. తమ కుటుంబంపై రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న బయోపిక్ కొండా మూవీ ప్రమోషన్ కోసం ఆమె ఇవాళ వర్మతో కలిసి విజయవాడలో అడుగుపెట్టారు. నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత కొండా సురేఖ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబంతో తన అనుబంధం, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, వచ్చే ఎన్నికల్లో తన పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కొండా చిత్రంపై సురేఖ

కొండా చిత్రంపై సురేఖ


కొండా దంపతుల జీవిత చరిత్ర ప్రజలకు తెలిపేందుకు సినిమా తీశామని సురేఖ వెల్లడించారు. నిజ జీవితంలో నక్సల్ ఉద్యమం, తమ రాజకీయ ప్రయాణం,మా లవ్ స్టోరీ బేస్ చేసుకొని సినిమా తీశారన్నారు. నిజం జీవితంలో తాము ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని ఆమె తెలిపారు. వైఎస్ఆర్ రాజకీయ భిక్షతోనే తాము ఈ స్థితిలో ఉన్నామన్నారు. నేటి రాజకీయాల్లో విలువలు అనేవి లేవని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని సురేఖ పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చెయ్యాలన్నారు.కొండా సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నామన్నారు.

వైఎస్సార్ తోనే అనుబంధం, కుటుంబంతో కాదు

వైఎస్సార్ తోనే అనుబంధం, కుటుంబంతో కాదు

వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ కుటుంబాన్ని కలిసింది లేదని కొండా సురేఖ తెలిపారు. వైఎస్ఆర్ తోనే తమకు అనుంబందం ఉందని, వారి కుటంబ సభ్యులతో లేదని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా చేసాక విజయమ్మ,షర్మిలమ్మతో కోర్టుకు అటెండ్ అయినప్పుడు మాత్రమే మాట్లాడానన్నారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబ సభ్యులను కలిసింది లేదు మాట్లాడింది లేదన్నారు. గతంలో వైఎస్ మరణం తర్వాత జగన్ ఓదార్పుయాత్రల్లో కూడా పాల్గొన్న సురేఖ.. ఇప్పుడు వైఎస్ తో మాత్రమే తనకు అనుబంధం ఉందని చెప్పడం విశేషం.

వరంగల్ ఈస్ట్ నుంచే పోటీ

వరంగల్ ఈస్ట్ నుంచే పోటీ

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నానని సురేఖ తెలిపారు. కాంగ్రెస్ దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. టీడీపీ ప్రభుత్వంలోనే తమపై అక్రమ కేసులు బనాయించారని సురేఖ తెలిపారు. నక్సలైట్లతో కలిసి తెలగాణ ఉద్యమం చేసిన కెసిఆర్ ఇప్పుడు నక్సలైట్లను అణచివేతకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టీఆర్ఎస్ నేతల ఆగడాలు ఉండేవి కావన్నారు. నక్సలైట్ల హయంలోనే తెలంగాణ బాగుండేదన్నారు. కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను తెరాస ప్రభుత్వం లాక్కుంటుందని సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్ లో రాహుల్ ,రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి వస్తామన్నారు. నక్సల్స్ ఉద్యమాలు చేస్తున్నపుడు ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగించలేదని సురేఖ చెప్పుకొచ్చారు.

English summary
former minister konda surekha on today come to vijayawada for konda movie promotion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X