పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులపై కొండా సురేఖ సంచలనం; జగన్ పాలనపై మరీ ఘాటుగా!!

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చూస్తుంటే తనకు ఏవగింపు కలుగుతుందని మాజీమంత్రి, వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ అన్నారు. ఆంధ్రాలో రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపించేలా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు..

వరంగల్ లో వన్ ఇండియా న్యూస్ తో ఆమె మాట్లాడుతూ తాను జైలులో ఉండి వచ్చాను కనుక చంద్రబాబు ను కూడా జైలులో పెట్టాలనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశ్యం కనిపించడం లేదనీ అన్నారు. ఇలాంటి దుష్ట పాలన సాగిస్తున్న జగన్ ను పడగొట్టెందుకు టీడీపీ జనసేన పొత్తులు అనివార్యమని అన్నారు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో అవసరమైతే కాంగ్రెస్ ఇతర పార్టీలు అన్నీ కూడా కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో సహకరించాలని అన్నారు.

Konda surekha sensation on pawan kalyan, chandrababu alliance, shocking comments on ys jagan

తెలంగాణ లో కెసిఆర్, ఆంధ్రా లో జగన్ పాలన రెండూ కూడా దుష్ట పాలనలే నని అన్నారు.. తెలంగాణాలో స్వార్థ, అవినీతి, భూకబ్జా ల పాలన కొనసాగుతుంటే, ఆంధ్రాలోనీ జగన్ పాలనలో యధేచ్ఛగా ప్రజాస్వామ్య, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పార్టీలు, నేతలు ప్రగతికి విఘాతం కలిగిస్తారని అన్నారు.

తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చూసి జగన్ పాలన చూస్తుంటే రాజకీయాలు అంటేనే అసహ్యం వేస్తోందని అన్నారు. జగన్ కక్ష సాధింపు రాజకీయాలతో ప్రజల్లో ఒక విధమైన భయాందోళనలు కలిగిస్తున్నారని అన్నారు. రాజకీయ కక్ష లతో చంద్రబాబు ను జైలులో పెట్టి ఏం సాధించారని ఆమె జగన్ ను ప్రశ్నించారు. ఇలాంటి ఆలోచన అంత ప్రలకు మంచి చేయడంలో చూపిస్తే అద్భుతాలు జరిగి ఉండేవని అభిప్రాయ పడ్డారు.

ఎందుకంటే జగన్ పాలన రాక్షస పాలనను తలపిస్తోందని ఆరోపించారు. మరో వైపు ప్రజా సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవలసిన అసెంబ్లీ తీరు చూస్తుంటే ఆవేదన కలుగు తోందని అన్నారు. మళ్లీ జగన్ గనక గెలిస్తే అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా తయారు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+