ప్రధానితో మెగా కోడలు సమావేశం- ఉపాసన ఆకస్మిక భేటీ వెనుక : పవన్ కళ్యాణ్ తరువాత...!!

మెగాస్టార్ చిరంజీవి కోడలు...రాం చరణ్ సతీమణి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధానితో సమావేశం అయ్యారు. ఇప్పటికే వ్యాపార- సేవా రంగాల్లో ప్రముఖంగా నిలుస్తున్న ఉపాసన ఇప్పుడు ప్రధానితో సమావేశంలో ప్రస్తావించిన అంశాలతో జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధించారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ గా కొణిదెల ఉపాసన తన తాత సూచించిన మార్గంలో అటు వైద్య రంగం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, 'ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకున్నారు.

ప్రధానితో భేటీ పైన ట్వీట్

దీనికి సంబందించిన అంశాలను ఉపాసన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది ఇస్తుంది. మనం వాటిని తెలివిగా, సమర్థంగా ఉపయోగించుకోవాలి' అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఉపాసన ఆరోగ్యం - సేవా కార్యక్రమాల అంశాల్లో సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు.

సామాజిక సేవలో గుర్తింపు

సామాజిక సేవలో గుర్తింపు

అదే విధంగా జంతువుల సంరక్షణ కోసం పాటు పడుతున్నారు. తాజాగా, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‏లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకున్నారు. ఆరోగ్య పరంగా ఫిట్ నెస్ తో పాటుగా ఆయుర్వేద వైద్యం... హెల్త్ టిప్స్.. జంతువుల సంరక్షణ ..సామాజిక బాధ్యతల గురించి వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. ఇక, హీరోయిన్ సమంత తనకు క్లోజ్ ఫ్రెండ్ గా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ఉపాసన.. అనేక విషయాల్లో తానే తనకు స్పూర్తిగా నిలిచారని చెప్పారు.

అపోలో ఫౌండేషన్ వౌస్ ఛైర్మన్ గా

అపోలో ఫౌండేషన్ వౌస్ ఛైర్మన్ గా

ఇక, తన మామ చిరంజీవి ఈ వయసులోనూ ఏ మాత్రం జోష్ తగ్గకుండా చేసే పాత్రలు.. అంతకు మించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఉపాసన ప్రశంసించారు. ఆయన ఆలోచనలు..బ్లడ్ బ్యాంక్...ఆక్సిజన్ బ్యాంకు వంటి వాటి ద్వారా కరోనా సమాయంలో అందించిన సేవలను పలు సందర్భాల్లో ఉపాసన అభినందించారు. ఇక, పూర్తిగా తన కుటుంబానికి చెందిన అపోల్ సంస్థ ద్వారా కరోనా సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, ఇప్పుడు ప్రధానితో భేటీ అయిన ఫొటోను షేర్ చేస్తూ... తన లక్ష్యాలు..ఆలోచనలు ఏంటనేది ఉపాసన షేర్ చేసారు.

పవన్ కళ్యాణ్ తరువాత మెగా ఫ్యామిలీ నుంచి

పవన్ కళ్యాణ్ తరువాత మెగా ఫ్యామిలీ నుంచి

ప్రధానితో మోదీ తో భేటీ సమయంలోనూ వినూత్న ఆలోచనలను షేర్ చేసుకున్నారు. అయితే, మెగా కుటుంబంలో 2014 ఎన్నికల ముందు..తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ప్రధాని మోదీని కలిసారు. ఇక, మెగా ఫ్యామిలీ సభ్యులు ఎవరూ ప్రధానితో సమావేశం కాలేదు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కు సైతం కలిసే అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఉపాసన ప్రధానితో సమావేశం కావటం..స్వయంగా భేటీ అంశాలను వెల్లడించటం తో ఆ ఫొటోతో పాటుగా ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్... పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+