బాబుకు 'కోటయ్య' నివేదిక, కేబినెట్లో చర్చ: ఏంచెప్పింది?
హైదరాబాద్: రుణమాఫీ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోటయ్య కమిటీ తుది నివేదికను సోమవారం సమర్పించింది. నివేదికలో కోటయ్య కమిటీ మాఫీ పైన మార్గదర్శకాలు అందించింది. సోమవారం ఉదయం ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీలో కోటయ్య కమిటీ నివేదిక పైన చర్చిస్తున్నారు.
కోటయ్య కమిటీ తన నివేదికలో పలు అంశాలను పొందుపర్చింది. ఇందుకు సంబంధించిన అంశాలను మంత్రివర్గం ఈ రోజు పూర్తిగా వెల్లడించే అవకాశముంది. బ్యాంకర్లతో చర్చించాక నివేదికను ఏపీ ప్రభుత్వం ఆర్బీఐకి పంపించే అవకాశముంది.

- లాభాల్లో ఉన్న కార్పోరేషన్ బాండ్లను తనఖా పెట్టుకోవచ్చు
- పంట రుణమాఫీ కోసం ఎర్రచందనం నిల్వలను అమ్మకం
- పంట రుణాలు లక్షన్నర వరకు మాఫీ చేయవచ్చు
- పంట రుణాలు అయితే లక్షన్నర వరకు, బంగారంపై రుణాలు అయితే రూ.50వేల వరకు మాఫీ చేయొచ్చు
- ప్రస్తుతానికి కుటుంబానికి ఒక రుణమాఫీ
- గరిష్టంగా కుటుంబానికి లక్షన్నర
- పంట రుణాలు రూ.34వేల కోట్లు ఉన్నాయి
- బంగారం రుణాలు రూ.24వేల కోట్లు ఉన్నాయి
- డ్వాక్రా రుణాలు రూ.12వేల కోట్లు ఉన్నాయి












Click it and Unblock the Notifications