వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుట్టా కు షాక్‌..క‌ర్నూలు టిడిపిలో కొత్త గుబులు : కోట్ల కుటుంబానికి ఆ సీట్లు ఖ‌రారు.!

|
Google Oneindia TeluguNews

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్ర‌కాశ్ రెడ్డి త‌న అనుచ రు ల‌తో క‌లిసి టిడిపిలో చేరాల‌ని నిర్ణ‌యించారు. సీట్లు కేటాయింపు..భ‌విష్య‌త్ అవకాశాల పై చ‌ర్చించేందుకు టిడిపి అధినే త తో విందు స‌మావేశం ఏర్పాటు చేసారు. అయితే, కోట్ల కుటుంబానికి ఇస్తామ‌ని చెబుతున్న సీట్లు..ఇప్పుడు టిడిపిలోని ఆశావాహుల్లో టెన్ష‌న్ పుట్టిస్తోంది. వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన నేత‌ల‌కు కొత్త గుబులు మొద‌లైంది.

టిడిపి లోకి కోట్ల కుటుంబం..!

టిడిపి లోకి కోట్ల కుటుంబం..!

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో భారీ మ‌ర్పు చోటు చేసుబోతోంది. క‌ర్నూలు మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి త‌న కుటుంబ స‌భ్యులు..అనుచ‌రుల‌తో క‌లిసి టిడిపిలో చేరాల‌ని నిర్ణ‌యించారు. కొద్ది రోజులుగా కోట్ల కాంగ్రెస్ వీడుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న టిడిపిలోకి వెళ్తార‌ని సాగుతున్న ప్ర‌చారంలో భాగంగా..ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి ఆహ్వానం మేర‌కు ఆయ‌న‌తో విందు సమావేశం లో పాల్గొంటున్నారు. టిడిపి లో చేర‌టం ఖాయ‌మైనా..త‌న‌కు..త‌న కుటుంబ స‌భ్యులు..అనుచ‌రుల‌కు సీట్ల కేటాయింపు పై ఆయ‌న ప్ర‌ధానంగా ముఖ్య‌మంత్రి తో చ‌ర్చించ‌నున్నారు. 2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలోని రెండు లోక్‌స‌భ స్థానాల‌ను వైసిపి గెలుచు కుంది. జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో కేవ‌లం మూడింట మాత్ర‌మే టిడిపి గెలుపొందింది. ఇక‌, ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌లం పెంచుకోవ‌టం కోసం క‌ర్నూలు జిల్లాలో బ‌లమైన కోట్ల వ‌ర్గాన్ని టిడిపిలో చేర్చుకోవాల‌ని నిర్ణ‌యించారు.

కోట్ల కోరుతున్న సీట్లు..ఇచ్చేవి ఏవి..

కోట్ల కోరుతున్న సీట్లు..ఇచ్చేవి ఏవి..

కోట్ల సూర్య‌ప్ర‌కాశ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు లోక్‌స‌భ స్థానం ఇవ్వ‌టం ఖాయ‌మైంది. ఈ మేర‌కు ఇచ్చిన హామీ తోనే
ఆయ‌న టిడిపి లో చేర‌టానికి సిద్ద‌మ‌య్యారు. కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి క‌ర్నూలు నుండి సీటు ఇవ్వ‌టంతో పాటుగా ఆయ న కుమారుడికి డోన్ సీటు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అదే విధంగా త‌న ప్ర‌ధాన అనుచ‌రుడికి కోడుమూరు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి తో చ‌ర్చ‌ల్లో భాగంగా ప్ర‌తిపాదిస్తున్నారు. కోట్ల కుటుంబంతో జిల్లా లో తొలి నుండి రాజ‌కీయంగా వ్య‌తిరే కిస్తున్న కెఇ కృష్ణ‌మూర్తితోనూ ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ఈ విష‌యం పై చ‌ర్చించినట్లు స‌మాచారం. ఆయ‌న సైతం అం గ‌కీరించార‌ని చెబుతున్నారు. అయితే, కోట్లు ప్ర‌తిపాదించే మూడు సీట్ల‌లో క‌ర్నూలు ఎంపితో పాటుగా ఒక అసెంబ్లీ స్థా నం ఇవ్వ‌టానికి ముఖ్య‌మంత్రి అంగీక‌రించే అవ‌కాశం ఉంది. రెండో అసెంబ్లీ సీటు కేటాయింపు పైనే ముఖ్య‌మంత్రి ఏ విధంగా స్పందిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

కోట్ల రాక‌తో ఎవ‌రికి చెక్‌..

కోట్ల రాక‌తో ఎవ‌రికి చెక్‌..

కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి టిడిపిలో చేరిక‌తో ఆయ‌న క‌ర్నూలు ఎంపిగా బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే, 2014 ఎన్నిక‌ల్లో వై సిపి నుండి క‌ర్నూలు ఎంపిగా గెలిచిన బుట్టా రేణుక టిడిపిలోకి ఫిరాయించారు. క‌ర్నూలు ఎంపీగా తిరిగి పోటీ చేస్తార‌ని క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంత్రి లోకేష్ ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు కోట్ల రాక‌తో స‌మీక‌ర‌ణాలు మారు తున్నాయి. దీంతో..బుట్టాకు బ‌న‌గాన‌ప‌ల్లె నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని సూచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక‌, కోట్ల కుమారుడుని పాణ్యం లేదా డోన్ నుండి బరిలోకి దించాల‌ని ప్ర‌తిపాదిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో టిడిపి ఇప్ప‌టికే హామీ ఇచ్చి ఉంది. పాణ్యం నుండి 2014 ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఉన్నా రు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టిడిపి నుండి పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజుల క్రితం సీయం ను క‌లిసి మ‌రోసారి ఏరాసు హామీ తీసుకున్నారు. ఇక‌, డోన్ నుండి కెఇ ప్ర‌భాక‌ర్ కు ఇప్ప‌టికే సీయం హామీ ఇచ్చారు. దీంతో..ఈ రెండు సీట్ల‌లో ఏది కోట్ల కుటుంబానికి ఇస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. ఇక‌, కోడుమూరు సైతం కోట్ల కోరుతున్నారు. అక్క‌డ వైసిపి నుం డి టిడిపిలో ఫిరాయించిన మ‌ణిగాంధీ ఉన్నారు. ఆయ‌న‌కు చెక్ త‌ప్పేలా లేదు. ఇప్పుడు బుట్టా రేణుక కు బ‌న‌గాన‌ప‌ల్లె సీటు ఇస్తే అక్క‌డ ఉన్న సిట్టింగ్ టిడిపి ఎమ్మెల్యే బిసి జనార్ధ‌న రెడ్డి ప‌రిస్థితి ఏంట‌నేది చూడాలి.

English summary
Ex Central Minister Kotla Surya prakasa Reddy decided to join in TDP. He meeting with Chandra babu with his family members. He expecting Kurnool loksabha and two assembly seats for his followers. Now this demand make ot discussion in Kurnool TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X