విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడే చెప్పా: టిడిపి భేటీకి జగన్ పార్టీ ఎంపి గీత

By Pratap
|
Google Oneindia TeluguNews

Kothapalli Geetha attends TDP MPs meeting
విజయవాడ: తెలుగుదేశం, బిజెపి పార్లమెంటు సభ్యుల సమావేశానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కూడా హాజరయ్యారు. గత కొంత కాలంగా ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రాజెక్టులు, నిధులు, సంస్థల ఏర్పాటుపై బిజెపి, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు విజయవాడలో శనివారం సమావేశమయ్యారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరిన పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి కూడా హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆత్మగౌరవం లేకపోవడం వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉంటానని తాను గతంలోనే చెప్పానని ఆమె చెప్పారు.

త్వరలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటికి రాబోతున్నారని గీత చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆమె హితవు పలికారు. తాను తెలుగుదేశంలో ఎప్పుడు వెళ్లేది త్వరలో చెబుతానని గీత తెలిపారు.

సంస్కారం, మర్యాదలేని పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీలో ఎవరు ఏం మాట్లాడుతారో తెలియదని ఆరోపించారు. ఆత్మగౌరవం లేకుండా చాలా మంది పార్టీలో ఉన్నారని, వాళ్లంతా ఏదో ఒక రోజు పార్టీ నుంచి బయటికి వస్తారని ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఈ రోజు సమావేశానికి వచ్చానని ఆమె చెప్పారు.

English summary

 Disgruntled YSR Congress party MP Kothapalli Geetha has attended Telugudesam and BJP MPs meeting held at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X