బాబు అన్యాయం చేస్తున్నారు, టీడీపీతో సంబంధం లేదు: కొత్తపల్లి గీత
తెలుగుదేశం పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం గిరిజన ప్రజాప్రతినిధులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ..
తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం గిరిజన ప్రజాప్రతినిధులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందు పెడతానని తెలిపారు.
రంపచోడవరం ఐటీడీఏ సమావేశానికి హాజరుకాబోనని గీత స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20మందితో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలిలో కొత్తపల్లి గీతకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో గీత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇప్పటికే ఈ సలహా మండలి ఏర్పాటు తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన ఎమ్మెల్యేలు కూడా ధ్వజమెత్తారు. కాగా, గీత ఎస్టీ కాదని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఎస్టీ కాకున్నా.. 2014ఎన్నికల్లో ఎస్టీగా అరకు నుంచి పోటీ చేసి గెలుపొందారని, అందు వల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని సంధ్యారాణి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, ఆ పిటిషన్ కొట్టేయాలని కోరుతూ కొత్తపల్లి గీత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. గీత దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో కొట్టేసింది. కాగా, 2014 ఎన్నికల్లో అరకు లోకసభ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీడీపీలో చేరారు.












Click it and Unblock the Notifications