వైసీపీలో మరో కలకలం : టార్గెట్ కొడాలి నాని - వంశీ..!!

కృష్ణాజిల్లా వైసీపీలో అసమ్మతి రాజకీయం మొదలైంది. కొడాలి నాని -వంశీ లక్ష్యంగా నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

అధికార వైసీపీలో నెల్లూరు నేతల కలకలం కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే సమయంలో కృష్ణాజిల్లాలో కొత్త రాజకీయం మొదలైంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ పైన ఆ నియోజకవర్గ వైసీపీ సీనియర్లు తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వంశీతో పాటుగా ఆయనకు మద్దతిస్తున్న మాజీ మంత్రిని ఆ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో వంశీ వ్యతిరేక వర్గం నేత స్వతంత్ర అభ్యర్దిగా బరిలో దిగే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఈ సమయంలో ఆ నేతల మధ్య ఈ ఇద్దరు నేతల గురించి జరిగిన సంభాషణ వైరల్ అవుతోంది.

Krishna District YCP leaders serious Comments on Kodali Nani and Vallbhaneni Vamsi, Hi command Serious

కృష్ణాజిల్లాలో కొద్ది రోజుల క్రితం మైలవరం నియోజకవర్గంలో నాయకత్వం పై రచ్చ చోటుచేసుకుంది. ఇప్పుడు గన్నవరం పంచాయితీ మొదలైంది. గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీకి దగ్గరైన సమయం నుంచి అక్కడి వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు.. దుట్టా రామచంద్రరావు ఆగ్రహంతో ఉన్నారు. వంశీతో కలిసి పని చేయలేమని స్పష్టం చేస్తున్నారు. వంశీతో కలిసి పని చేసుకోవాలని పార్టీ నాయకత్వం సూచించినా అందుకు ఆ ఇద్దరు నేతలు సుముఖంగా లేరు. ఇదే సమయంలో వంశీకి మాజీ మంత్రి కొడాలి నాని అండగా ఉన్నారు. దీంతో ఇప్పుడు కొడాలి నాని కూడా ఇద్దరు నేతలకు టార్గెట్ అయ్యారు. ఇప్పుడు యార్లగద్ద వెంకటరావు.. దుట్టా రామచంద్రరావు ఇద్దరూ ఇక ప్రయివేటు కార్యక్రమంలో కలుసుకున్న సందర్భంలో చోటు చేసుకున్న సంభాషణ వైరల్ అవుతోంది. అందులో నాని - వంశీ గురించి ఆ ఇద్దరు చేసిన కొన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

Krishna District YCP leaders serious Comments on Kodali Nani and Vallbhaneni Vamsi, Hi command Serious

కొడాలి నాని , వంశీపైన ఆ ఇద్దరు నేతలు వ్యంగాస్త్రాలు సంధించారు. కొడాలి నాని విద్యార్హత గురించి అందులో ప్రస్తావించారు. ఏ సినిమాలో అయిన హీరో కంటే విలన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుందటూ కామెంట్ చేసారు. వల్లభనేని వంశీ.. కొడాలి నాని ఆస్తుల గురించి ఆ ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చింది. నియోజకవర్గానికి వాళ్లు ఉపయోగపడతారా అంటూ జరిగిన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారంటూ ఆ ఇద్దరు నేతలు చర్చించారు. వల్లభనేని వంశీ ఆగడాలను మేం పశ్నించిన కారణంగానే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది అని దుట్టా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమవుతన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరి వ్యాఖ్యల పైన కొడాలి నాని - వంశీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+