చంద్రబాబు కృష్ణాటూర్ ఎఫెక్ట్- టీడీపీలోకి వైసీపీ కీలక నేత ఫ్యామిలీ ?
ఏపీ రాజకీయాల్లో కృష్ణాజిల్లా రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. కమ్మ సామాజిక వర్గం హవా సాగే ఈ ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు కాస్త మారినట్లు కనిపించాయి. అయితే తిరిగి మరో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తిరిగి రాజకీయాలు మరో టర్న్ తీసుకుంటున్నాయి. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత వైసీపీనే నమ్ముకుని ఉన్న నేతలు కాస్తా తిరిగి పసుపు పార్టీవైపు చూస్తున్నారు.
చాలా కాలం తర్వాత కృష్ణాజిల్లాకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తిరిగి ఇక్కడి నేతల్నే ధైర్యం నింపారు. ఈ నేపథ్యంలోనే గన్నవరానికి చెందిన వైసీపీ కీలక నేతలు దాసరి బాలవర్ధన్ రావు, దాసరి జైరమేష్ సోదరులు ఇప్పుడు తిరిగి టీడీపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి దాదాపు దూరంగా ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు చంద్రబాబు టూర్ తో తమ ప్రాధాన్యతలు మార్చుకున్నట్లు అర్ధమవుతోంది.

చంద్రబాబు కృష్ణాజిల్లా టూర్ సందర్భంగా ఆయన్ని ఆహ్వనిస్తూ దాసరి బాలవర్ధన్ రావు పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. దీనిపై వైసీపీ నేతలు షాకయ్యారు. అయినా ఆయన్ను వారించే పరిస్ధితి లేదు. దీంతో దాసరి సోదరులు టీడీపీలోకి వెళ్లిపోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా త్వరలో ఆయనతో పాటు భార్య బసవతారకం కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసిన దాసరి సోదరులు, వాటి అవిష్కరణకు చంద్రబాబు, మరియు భువనేశ్వరికి ఆహ్వానం పంపారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి తపప్క హాజరు అవుతారని దాసరి జైరమేశ్ ప్రకటించారు.

ఇప్పటికే గన్నవరంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు తీవ్రంగా ఉంది. వైసీపీలోనే రెండు మూడు వర్గాలు తయారయ్యాయి. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు మోహరించాయి. ఈ సమయంలోనే టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న బచ్చుల అర్జునుడు హఠాన్మరణం పాలయ్యారు. ఆయన స్ధానంలో టీడీపీ అభ్యర్ధి లేదా ఇన్ ఛార్జ్ గా చంద్రబాబు ఇప్పటివరకూ ఎవరినీ ప్రకటించలేదు. కానీ ఇప్పుడు దాసరి సోదరులు పార్టీకి వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications