కృష్ణా నదికి భారీగా వరద నీరు.. తెరుచుకున్న శ్రీశైలం గేట్లు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది. ఈ క్రమంలో డ్యామ్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు గేట్లను ఎత్తారు. 4 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేశారు. శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి అనంతరం గేట్లు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. ఈ సారి త్వరగా డ్యామ్ నిండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న క్రమంలో శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. దీంతో శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. 4 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని సాగర్ కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ సారి జూన్ లోనే వరద ప్రారంభం అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. జులై మొదటి వారానికే దాదాపు శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తాలని నిర్ణయించారు. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులు కాగా. అయితే నీటి నిల్వ ప్రస్తుతం 528.80 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

శ్రీశైలం డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగాప్రస్తుతం 165.81టీఎంసీలకు నీరు చేరినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ నుంచే వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో సాగర్ ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాల్వకు తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications