కృష్ణా జలాల వివాదం: ఇటూ అటూ భేటీలు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల విడుదల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో కేంద్ర జలమండలి చైర్మన్ పాండ్య మంగళవారం భేటీ అయ్యారు.
కృష్ణా జలాల విడుదలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు మంగళవారం ఉదయమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాండ్య భేటీ అయ్యారు. సాయంత్రం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులతో పాండ్య సమావేశంకానున్నారు.

తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 10 టిఎంసిల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2 టిఎంసిలల నీటిని విడుదల చేస్తామని చెప్పింది. అయితే రెండు టీఎంసీల నీటిని విడుదల చేస్తే కనీసం పులిచింత వరకు కూడా రావని ఏపీ అధికారులు చెప్పారు.
ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం 10 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పుకోకపోతే సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications