Krishnapatnam medicine: కొద్దిగంటల్లో ఆనందయ్య మందు పంపిణీ షురూ -దాని పేరు ‘ఔషధ చక్రం’
కొవిడ్ వ్యాధిని తగ్గించేది కానప్పటికీ, కరోనా సోకినవారికి ఉపశమనం కలిగిస్తుండటం, దుష్ప్రభావాలేవీ లేకపోవడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున పంపిణీకి రంగం సిద్ధమైంది. సోమవారం(జూన్ 7) ఉదయం నుంచే తన కరోనా మందును పంపిణీ చేయనున్నట్లు ఆనందయ్య ప్రకటించారు.
Recommended Video

అన్ని జిల్లాలకు కిట్లు..
కరోనా మందుకు సంబంధించి ఆనందయ్య తాజాగా విడుదల చేసిన వీడియోలో కీలక అంశాలను పేర్కొన్నారు. తాను మందు పంపిణీ చేయడం లేదని కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దానిని ఎవరూ నమ్మవద్దని కోరారు. మందుల తయారీ జరుగుతోందని, సోమవారం నుంచి కచ్చితంగా పంపిణీ చేస్తామన్నారు. తొలుత తన సొంత నియోజకవర్గం సర్వేపల్లి పరిధిలోని ప్రతి ఇంటికి మందు పంపిణీ చేస్తామని, అదే సమయంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా సోమవారం నుంచే మందుల కిట్లు పంతున్నామని చెప్పారు.

ఎవరూ కృష్ణపట్నం రావొద్దు..
కరోనాకు ఆనందయ్య మందు బాగా పాపులర్ కావడం, కృష్ణపట్నానికి జనం పోటెత్తడంతో ఆ పరిసర ప్రాంతాల్లో కొవిడ్ కొత్త కేసులు భారీగా నమోదుకావడం తెలిసిందే. రద్దీని నియంత్రించే ఉద్దేశంతో మందును అన్ని జిల్లాలకు పంపుతున్నట్లు ఆనందయ్య తెలిపారు. మందు కోసం ఎవరూ నేరుగా కృష్ణపట్నం రావొద్దని, అధికార యంత్రాంగం ద్వారా అన్ని జిల్లాలకు పంపుతామని, అధికారుల నేతృత్వంలో పంపిణీ జరుగుతుందని ఆనందయ్య స్పష్టం చేశారు.

ఆనందయ్య మందు పేరు ‘ఔషధ చక్రం’
తన గురువుల సహకారంతో 30 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నానని, అనారోగ్యానికి గురైన వారికి ఆయుర్వేద మందు అందజేస్తున్నానని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన మందుకు 'ఔషధ చక్రం' అని పేరు పెట్టామని తెలిపారు. ఇకపై దీనిని ఆనందయ్య మందు లేదా కృష్ణపట్నం మందు అనకుండా ఔషధ చక్రంగానే పరిగణించాలని ఆయన కోరారు. కృష్ణపట్నం శివారులోని తన సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ కుటీరం నిర్మాణానికి ఆనందయ్య శనివారం భూమి పూజ చేశారు. ఆదివారం నిర్మాణం దాదాపు పూర్తికాగా, సోమవారం నుంచే మందు పంపిణీని చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications