సివిల్స్ ఫలితాల్లో తెలుగుతేజాలు: జైపూర్‌కు తొలి ర్యాంక్

హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగుతేజాలు తమ సత్తా చాటారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాల నుంచి 40 దాకా ర్యాంకులు దక్కాయి. కేవలం ఐఏఎస్ కేడర్‌కే 20 మంది ఎంపికయ్యారని తెలిసింది. సివిల్ సర్వీసెస్ -2013 ఫరీక్షల ఫలితాలను యుపిఎస్‌సి గురువారం ప్రకటించింది. 1122 మందికి ఈ పరీక్షల్లో అర్హత లభించినట్టు యుపిఎస్‌సి పేర్కొంది.

డిసెంబర్ 2013లో నిర్వహించిన ప్రధాన పరీక్ష, ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. ఐఎఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపిఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఎ, గ్రూప్-బి స్థాయి ఉద్యోగాలకు ఈ పరీక్ష నిర్వహించారు. జనరల్ కేటగిరి కింద 517మందిని, ఒబిసి 326 మందిని, ఎస్సీ 187 , ఎస్టీ -92 మంది కలిపి మొత్తం 1122 మందిని ఎంపిక చేశారు.

ఐఏఎస్‌కు 180 మంది ఎంపిక కాగా, ఐఎఫ్‌ఎస్‌కు 32 మంది ఎంపికయ్యారు. ఐపిఎస్‌కు 150 మంది ఎంపిక కాగా, గ్రూప్-ఏ సర్వీసులకు జనరల్ 369 మంది, గ్రూప్-బి సర్వీసులకు జనరల్ 71 మంది ఎంపికయ్యారు. మొత్తంగా చూస్తే సర్వీసులు అన్నీ కలిపి జనరల్ అభ్యర్ధులు 622 మంది, ఒబిసి 326, ఎస్సీ 188 , ఎస్టీ 92 కలిపి 1228 మంది ఎంపికయ్యారు. వీరిలో వికలాంగులు 30 మంది ఉన్నారు.

 Kritika Jyotsna topper from Hyderabad, got 30th rank

జాతీయ స్థాయిలో జైపూర్‌కు చెందిన గౌరవ్ అగర్వాల్ టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్ని వరుసగా ఢిల్లీకి చెందిన మునీష్ శర్మ, జార్ఖండ్‌కు చెందిన రచిత్ రాజ్ సాధించారు. మహిళల విభాగం నుండి టాపర్‌గా ఐదో ర్యాంకర్ భారతి దీక్షిత్ ఎంపికయ్యారు. ఇక హైదరాబాద్‌కు చెందిన క్రితిక జ్యోత్స్న జాతీయ స్థాయిలో 30వ ర్యాంకును సాధించారు. మహబూబ్‌నగర్‌లో హైదరాబాద్‌లో విద్యనభ్యసించిన ముషారఫ్ అలీ ఫరూఖీ 80వ ర్యాంక్ సాధించారు. నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణ ఆదిత్య 99వ ర్యాంక్ సాధించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఎంపికైన వారిలో పలువరు:

క్రితిక జ్యోత్న్స(30), భవ్యమిట్టల్ (34), పి ఆకాష్ (63), దివ్యప్రభు(82), కృష్ణ ఆదిత్య(99), సాయి చరణ తేజస్వి(124), పీయుష్ సమారియా(165), సింధు శర్మ(213), అమృత వర్షిణి (217) వీర వెంకట రాకేష్ రెడ్డి (219), ప్రియాంక గులాటి (290), రంజన్ అగర్వాల్ (317), పి గౌతమ్ (318), దేవంగి స్వర్ణకార్ (322), మోనికా గుప్త(323), పార్థసారధి భాస్కర్ (395), చెరుకూరి కీర్తి(440), లక్ష్మీకాంత్‌బన్సాల్ (631), అరిందం ధార్ (647), పి మాధురి (817), ఎన్ అనిల్ కుమార్ (885) ఉన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+