కృపామణి ఆత్మహత్య కేసు: తల్లి, సోదరుడు, మరదలు అరెస్ట్
ఏలూరు: సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కృపామణి తల్లి లక్ష్మీ, సోదరుడు రాజ్ కుమార్, మరదలు కల్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో నిందితులు పట్టుబడ్డారు.
ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వర రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందులో ఓ నిందితుడు పోలీసుల కళ్లుగప్పి పారిపోయినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ కేసు పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.
నిందితులను దెందులూరు మండలం చల్లచింతలపూడిలో అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

తనను పుట్టింటి వారు వ్యభిచారం చేయాలని వేధిస్తున్నారంటూ లేఖ రాసి కృపామణి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
కృపామణి ఆత్మహత్య కేసు విషయమై మంత్రి పీతల సుజాత రెండు రోజుల క్రితం స్పందించారు. కృపామణి ఆత్మహత్య కేసులో దోషులను ఉపేక్షించేది లేదని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్‌లోని కృపామణి భర్త, బంధువులను ఆమె పరామర్శించారు.












Click it and Unblock the Notifications