కృపామణి ఆత్మహత్య కేసు: సాయి శ్రీనివాస్ నివాసంలో సోదాలు

ఏలూరు: కృపామణి ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతమైంది. సోమవారం రాత్రి నిందితుడు సాయి శ్రీనివాస్‌ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో యువతుల వీడియోలు, ఫొటోలు ఉన్నట్టు సమాచారం.

అల్లుడు పవన్ కుమార్‌తో కృపామణి తల్లి లక్ష్మి గొడవపడిన ఆడియో టేపులను పోలీసులు సేకరించారు. పవన్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న కృపామణిని వ్యభిచారం చేయాలని తల్లిదండ్రులు, సోదరుడు తీవ్రమైన ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెను రూ. 7 లక్షలకు సాయి శ్రీనివాస్‌కు విక్రయించిన విషయం తెలిసిందే.

Krupamani suicide case: Raids in Sai Srinivas's house

తల్లిదండ్రుల వేధింపులు భరించలేక ఇటీవల కృపామణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించిది. వ్యభిచారం చేయాలని కృపామణిని సాయి శ్రీనివాస్ తీవ్రంగా వేధించాడు. తాను చెప్పినట్టు వినకపోతే నగ్న వీడియోలను నెట్‌లో పెడుతానని సాయిశ్రీనివాస్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలోనూ వేధింపులు తాళలేక తల్లిదండ్రులు, సాయిశ్రీనివాస్‌పై కృపామణి కేసు పెట్టింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

కాగా బెయిల్‌పై వచ్చి తర్వాత కూడా కృపామణిని నిందితులు వేధింపులకు గురిచేశారు. అప్పటి నుంచి కృపామణికి వేధింపులు మరింత పెరిగాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. తల్లిదండ్రులు, సోదరుడు వ్యభిచారంలోకి దింపాలని చూస్తున్నారనే మనస్థాపంతో ఇటీవల కృపామణి వేల్పూరులోని ఓ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+