కెసిఆర్ వద్ద కెటిఆర్ అప్పు రూ.43 లక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తన తండ్రి, పార్టీ అధ్యక్షులు కల్వకుండ్ల చంద్రశేఖర రావు నుండి అక్కర నిమిత్తం రూ.43.40 లక్షలను అప్పుగా తీసుకున్నారట. ఈ విషయాన్ని కెటిఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
బుధవారం సిరిసిల్ల అసెంబ్లీకి తెరాస తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అందులో తన ఆస్తులు, అప్పులను పేర్కొన్నారు. తన పేరిట చరాస్తులు.. రూ.2,97,53,020, భార్య పేరిట రూ.2,05,98,239, తనయుడి పేరిట రూ.3,85,000, కూతురు పేరిట రూ.3,89,300 ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు.

స్థిరాస్థులు తన పేరిట రూ.74,65,015, భార్య పేరిట రూ.2,12.88,675, రుణాలు తన పేరిట రూ.1,82,99,042, భార్య పేరిట రూ.20,00,000 ఉన్నాయని పేర్కొన్నారు. కాగా అందులో 43 లక్షలకు పైగా తన తండ్రి నుండి అప్పుగా తీసుకున్నట్లు చెప్పారు.
భువనగిరి జగన్ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కర
భవవగిరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైంది.
బిజెపికి బలం లేదు: రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళంలో జిల్లాలో బిజెపికి క్యాడర్ లేదని టిడిపి ఎంపి అభ్యర్థి రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లాలో బిజెపికి సీటు ఇస్తే టిడిపి కేడరే పూర్తి పని చేయాల్సి ఉంటుందన్నారు. దీని పైన చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిశానన్నారు. పొత్తు బలం కావాలి గానీ బలహీనత కాకూడదన్నారు. నరసన్నపేట సీటు బిజెపికి ఇస్తే లోకసభకు ఇబ్బందవుతుందని పార్టీ బాబుకు చెప్పానన్నారు.












Click it and Unblock the Notifications