స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ వెనుక - అసలు లెక్క మొదలు..!!
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ లేదనే కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్యాకేజీ నిర్ణయం వెనుక కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. భారీ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇందుకు కేంద్రానికి దక్కిన హామీ మేరకే ప్యాకేజీ ఖరారైంది. ఈ ప్యాకేజీ నిర్ణయం పైన కార్మిక సంఘాలు భిన్నాభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఇప్పుడు ప్లాంట్ యాజమాన్యం, కార్మికులు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల పైన అసలు బాధ్యత పెరిగింది. కొత్త లెక్క మొదలైంది.
ప్యాకేజీ వెనుక
కేంద్రం స్టీల్ ప్లాంట్ కు రూ11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రూ.10,300 కోట్లు పెట్టుబడిలో భాగంగా పెడతామని, మిగిలిన రూ.1,140 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లో ప్రాధా న్యత వాటా మూలధనంగా మార్చుతామని కేంద్ర మంత్రి కుమార స్వామి వెల్లడించారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అప్పు రూ.35 వేల కోట్లుగా ఉందని, బ్యాంకు రుణాలు, వడ్డీ, సరుకు సరఫరా కు చెల్లింపులు చేయాల్సి ఉందని మంత్రి కుమార స్వామి తెలిపారు. తొలుత బ్యాంకర్లతో సమీక్షిం చామని, ప్లాంట్‌కు సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు. అందుకు బ్యాంకులు అంగీకరించలేదని పేర్కొన్నారు. దీంతో, తాను పీఎంఓ - ఆర్దిక మంత్రితో చర్చించానని చెప్పారు.

అసలు టార్గెట్
ఆర్థిక మంత్రి సూచనలతో ఎస్‌బిఐ నేతృత్వంలో కమిటీ వేశామని, కమిటీ నివేదికపై జిఒఎం చర్చల తరువాత రూ.11,440 కోట్ల ప్యాకేజీకి నిర్ణయం జరిగిందని అన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణను మంత్రివర్గం సవాల్‌గా తీసుకుందని, మూడు ఫర్నేస్‌లతో ఈ ఏడాది ఆగస్టు నాటికి92.3 శాతం ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యమని పేర్కొన్నారు. రెండేళ్లలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను అప్పుల్లో నుంచి బయటకు తేవడమే ప్రథమ కర్తవ్యమని, పూర్తిస్థాయిలో ప్లాంట్ పునరుద్ధరణ తరువాత సెయిల్‌లో విలీనంపై ఆలోచిస్తామని వెల్లడించారు. దీని ద్వారా ఈ ఏడాది ఆగస్టు నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు 92.3 శాతం మేర ఉత్పత్తి సామర్ధ్యం ఇప్పుడు ప్లాంట్ తో పాటుగా అందరికీ అసలు టార్గెట్ గా మారనుంది.

లక్ష్యం చేరుకుంటారా
స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు ప్యాకేజీ శాశ్వత పరిష్కారం కాదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించేందుకు, సెయిల్‌లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. శాశ్వత పరిష్కారాల కోసం కార్మికుల పోరాటం జరుగుతోందని, ప్యాకేజీ కోసం కాదని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్యాకేజీలు ప్రకటించి, ఆ తరువాత మూసివేసిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేస్తున్నాయి. అయితే, కేంద్రం ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీతో ఇక ప్లాంట్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని.. ఉత్పత్తి పెంచేలా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ,చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు నాటికి ఉత్పత్తి సామర్ధ్యం ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications