kuppam Election Results: వైసీపీకే - చంద్రబాబు కంచుకోట బద్దలు : నెల్లూరులోనూ ఏకపక్షంగా- ఎవరెక్కడ గెలిచారు..!!

కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారిన కుప్పం మున్సిపల్ ఎణ్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. ఏకపక్షంగా కుప్పం మున్సిపాల్టీని గెలుచుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం 25 వార్డుల్లో ఒక వార్డులో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. పోలింగ్ జరిగిన 24 వార్డుల్లో ఇప్పటి వరకు వైసీపీ 12 స్థానాల్లో స్పష్టతమైన ఆధిక్యతతో విజయం సాధించింది. తొలి రౌండ్ లో మొత్తం 14 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. కాగా, వైసీపీ కుప్పం మున్సిపాల్టీ పైన వైసీపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, నెల్లూరు కార్పోరేషన్ లోనూ వైసీపీ ఆధిక్యంలో ఉంది.

చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా


మొత్తం 54వార్డులకు గాను.. ఇప్పటి వరకు 36వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాల్టీని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 20 స్థానాల్లో వైసీపీ 17 గెలవగా.. టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాల్టీ సైతం వైసీపీ దక్కించుకుంది. ఈ మున్సి పాల్టీలో మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. అందులో వైసీపీ ఇప్పటికే 12 వార్డుల్లో విజయం సాధించింది. కర్నూలు జిల్లా బేతంచర్లలోనూ వైసీపీ గెలుపు బావుటా ఎగురవేసింది. కమలాపురం మునిసిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేససుకుంది.

మున్సిపాల్టీల్లోనై ఫ్యాన్ హవా

మున్సిపాల్టీల్లోనై ఫ్యాన్ హవా

కమలాపురంలోనూ వైసీపీ విజయం సాధించింది. దాచేపల్లిలో 11 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలుపొంది..మున్సిపాల్టీలపైన జెండా ఎగుర వేసారు. దర్శి మున్సిపాలిటీ టిడిపి కైవసం చేసుకుంది. గురజాలోనూ వైసీపీ విజయం సాధించింది. గురజాలలో వైసీపీ 16... టీడీపీ 3..జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి. పల్నాడులో ఎన్నికలు జరిగిన రెండు మున్సిపాల్టీలు ఇప్పుడు వైసీపీ ఖాతాలో చేరాయి. నెల్లూరు లో ఏకపక్షంగా వైసీపీ దూసుకెళ్తోంది. ఇక, కుప్పంలో ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా పోలింగ్ రోజు సాయంత్రం వరకు పరిస్థితి కనిపించగా.. ఫలితాల్లొ మాత్రం వైసీపీ హవా కొనసాగుతుంది.

ఏకపక్ష విజయాలతో వైసీపీలో పండుగ

ఏకపక్ష విజయాలతో వైసీపీలో పండుగ

మొత్తం 25 స్థానాలు ఉండగా.. 13 స్థానాలు గెలిచిన పార్టీ ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుంది. ఇప్పటికే వైసీపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. అయిదో వార్డులో టీడీపీ విజయం సాధించింది. కాగా, రెండో రౌండ్ లో 15వ వార్డు నుంచి 25వ వార్డు వరకు కౌంటింగ్ జరగనుంది. తొలి నుంచి వైసీపీ ముఖ్య నేతలు చంద్రబాబు కంచుకోటను బద్దలు చస్తామని చెబుతూ వచ్చారు. ఇక, రాయలసీమలో కీలకంగా మారిన పెనుకొండ లోనూ వైసీపీ విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+