కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుప్పంలో వైసీపీ ముందంజ - కొనసాగుతున్న ఉత్కంఠ : ఏ మున్సిపాల్టీలో ఎవరికెన్ని..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

హోరా హోరీగా సాగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1-15 వార్దుల వరకు తొలి రౌండ్ లో కౌంటింగ్ కొనసాగుతోంది.1,2,7 వార్డుల్లో వైసీపీ అధిక్యతలో ఉంది. ఇప్పటికే 14వ వార్డు ఏకగ్రీవం అయింది. తొలి రౌండ్ లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతోంది. కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. కానీ, ఒక్కరూ ఓటు వేయలేదు. దీంతో.. నేరుగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

కుప్పం పైనే అందరి చూపు

కుప్పం పైనే అందరి చూపు

కుప్పంలో మొత్తంగా 25 వార్డులు ఉండగా.. ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవం అయింది. దీంతో..24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఎన్. ప్రభాకర్ రెడ్డి నియమించారు. మొత్తం ఓట్ల లెక్కింపును వీడియో తీస్తున్నారు. ఆ మొత్తం తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ ముందు నుంచే ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ రోజున దొంగ ఓట్ల పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

మధ్నాహ్నానికి తుది ఫలితాలు

మధ్నాహ్నానికి తుది ఫలితాలు


అయితే, ఎన్నికల సంఘం మాత్రం వాటిని తోసిపుచ్చింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావటంతో అక్కడ ఎలాగైనా గెలవాలని టీడీపీ అధినేత చివరి వరకు ప్రయత్నాలు చేసారు. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దింపారు. వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పని చేసారు. దీంతో..ఇప్పుడు ఫలితాల సమయంలో మరింత ఉత్కంఘ కనిపిస్తోంది. కమలా పురం 9,10,11,14,15,17 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది.

పల్నాడులో హోరా హోరీ

పల్నాడులో హోరా హోరీ

11వ వార్డులో సలీల 83 ఓట్లతో..వైసిపి 14వ వార్డు వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి మేరి 85 ఓట్లతో గెలవగా.. 15వ వార్డులో సంధ్యారాణి 129 ఓట్లతో గెలుపొందారు. గురజాలలో మొత్తం 20 స్థానాలకు గాను వైసీపీ ఆరు స్థానాలు ఇప్పటికే దక్కించకుంది. రాజంపేట1వ వార్డులో షేక్ సుమియా.. 2వ వార్డులో వైసీపీ అభ్యర్ధి దాసరి మౌనిక గెలిచారు. రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్ హాల్‌లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం తో కొంత సేపు గందరగోళం ఏర్పడింది.

Recommended Video

Andhra pradesh : Kuppam లో Chandrababu Naidu కి చేదు అనుభవం
పెనుకొండలోనూ వైసీపీ ఆధిక్యత

పెనుకొండలోనూ వైసీపీ ఆధిక్యత

ఇక్కడ ఇప్పటి వరకు ప్రకటించిన అయిదు స్థానాలు వైసీపీ గెలుచుకుంది. పెనుకొండలో రెండు వార్డుల్లోనూ వైసీపీ గెలిచింది. గుంటూరు జిల్లా పల్నాడులోని దాచేపల్లి మున్సిపాల్టీలో టీడీపీ - వైసీపీ మధ్యమ హోరా హోరీ పోడు నడస్తోంది. ఇక్కడ టీడీపీ ఏడు స్థానాల్లో...వైసీపీ మూడు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. 8వ వార్డులో జనసేన గెలుపొందింది. దీంతో..ఇప్పుడు ఇక్కడ మున్సిపాల్టీ దక్కించుకోవాలంటే జనసేన మద్దతు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

English summary
YSRCP takes a lead in the first two rounds of counting in Kuppam Municipal elections while the postal ballot looks empty without any votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X