వెబ్ సీరీస్ చూసి.. ప్రియుడితో కలిసి భర్తను చంపి, ఆపై ఇల్లాలి షాకింగ్ పని!

సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యలు అన్ని ఇన్ని కావు. వివాహేతర సంబంధాలతో భార్యాభర్తల మధ్య చోటు చేసుకుంటున్న గొడవలు హత్యల దాకా వెళుతున్నాయి. అయితే ఒకప్పుడు భర్తలు మాత్రమే భార్యలను హతమార్చినట్టు ఎక్కువ వార్తలు విన్నాం. కానీ ప్రస్తుతకాలంలో భర్తలను హతమారుస్తున్న భార్యల తీరు చూస్తున్నాం. సోషల్ మీడియా, వెబ్ సిరీస్ ల పుణ్యమా అంటూ ఇళ్లల్లో రోజురోజుకు పెరిగిపోతున్న క్రిమినల్ ధోరణి సమాజంలో ఆందోళనకరంగా మారుతుంది.

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఇటీవల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎర్రకోట శివారులో సగం కాలిన ఒక మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. ఇందులో నిందితులు మృతుడి భార్యనేనని, ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందని గుర్తించిన పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మిగనూరు పద్మకు పెద్ద నెలాటూరు నరేంద్ర తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

Kurnool Crime Woman brutally Kills Husband with Lover s Help with the inspiration of the Web Series

వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య

వారికి ముగ్గురు పిల్లలున్నారు. నరేంద్ర పనికి వెళ్లిన సమయంలో, పద్మ అదే గ్రామానికి చెందిన వంశీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, అతడిని ఇంటికి పిలిపించుకునేది. ఈ విషయం తెలిసిన నరేంద్ర భార్యను మందలించడంతో పాటు, అనేకమార్లు పంచాయతీ కూడా పెట్టారు. పెద్దలు పంచాయతీ చేసినప్పటికీ పద్మ తన తీరును మార్చుకోలేదు. దీంతో అతను తన ఫ్యామిలీని ఎమ్మిగనూరుకు మార్చుకున్నాడు.

ప్రియుడితో కలిసి భర్తను చంపే ప్లాన్

అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రియుడితో పద్మ సంబంధాన్ని కొనసాగిస్తుంది. దీంతో వారిద్దరి మధ్య తరచు గొడవలు చోటు చేసుకోవడంతో పాటు, విడాకుల దాకా వెళ్లారు. అయితే ముగ్గురు పిల్లలు ఉన్న నేపథ్యంలో భార్యను వదిలిపెట్టడానికి ఇష్టపడని భర్త నరేంద్ర ఆమెను తనతో కాపురం చేయాలని కోరారు. అయితే భర్త విజ్ఞప్తిని నిరాకరించిన పద్మ ప్రియుడు వంశీతో కలిసి పథకం వేసింది.

భర్తను చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య

భర్తను అడ్డు తొలగించుకుంటే, ప్రియుడితో స్వేచ్ఛగా ఉండొచ్చని భావించిన ఆమె వెబ్ సిరీస్ లు చూసి, హత్య చేసి దొరక్కుండా ఎలా తప్పించుకోవచ్చో నేర్చుకుంది. దీంతో పథకం ప్రకారం నిద్రిస్తున్న నరేంద్ర గొంతును ప్రియుడు వంశీతో కలిసి నులిమి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని పొలాల్లోకి తరలించి పెట్రోల్ పోసి తగలబెట్టింది. మృతదేహం పూర్తిగా తగలబడి పోయిందని భావించి తిరిగి ఇంటికి వచ్చేసింది.

అనాధలుగా మారిన చిన్నారులు

అయితే మరుసటి ఉదయం పొలం పనులు చేయడానికి వెళ్ళిన గ్రామస్తులు సగం తగలబడిపోయిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివాహేతర సంబంధమే వ్యక్తి హత్యకు కారణమని గుర్తించి పద్మతో పాటు ఆమె ప్రియుడు వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+