నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాల ఎఫెక్ట్: కర్నూల్ వైసీపీ నేత టిడిపిలోకి, కీలక నేతలపై టిడిపి గురి

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్నూల్ వైసీపీ నేత టిడిపిలోకి, కీలక నేతలపై టిడిపి గురి Ysrcp key leader preparing to join TDP

కర్నూల్: నంద్యాల ఉపఎన్నిక ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్‌పిఎస్‌ను రద్దుచేసి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టిడిపిలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది. బిజెపికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు కూడ సైకిలెక్కేందుకు ప్రయత్నాలు చేసుకొంటున్నారని సమాచారం.

భూమా ఎఫెక్ట్: శిల్పాను వెంటాడిన దురదృష్టం, 2 నెలలకే, దెబ్బేనా?భూమా ఎఫెక్ట్: శిల్పాను వెంటాడిన దురదృష్టం, 2 నెలలకే, దెబ్బేనా?

కర్నూల్ జిల్లా నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి భారీ మెజారిటీలో విజయం సాధించడం టిడిపికి రాజకీయంగా కలిసివచ్చింది. దీని ప్రభావం కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలపై కూడ పడింది. దీంతో కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడ టిడిపి ఘన విజయం సాధించింది.

నంద్యాల ఎఫెక్ట్: ఆర్‌పిఎస్‌కు బైరెడ్డి గుడ్‌బై, అనుచరులతో సమావేశం, టిడిపిలోకినంద్యాల ఎఫెక్ట్: ఆర్‌పిఎస్‌కు బైరెడ్డి గుడ్‌బై, అనుచరులతో సమావేశం, టిడిపిలోకి

2019 ఎన్నికల్లో నంద్యాల నమూనాను అమలు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. అయితే ఇదే సమయంలో టిడిపిలోకి ఇతర పార్టీల నుండి వలసలు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా, కలిసిరాలేదా, తొందరపాటా?ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా, కలిసిరాలేదా, తొందరపాటా?

సాధారణ ఎన్నికలకు ముందే తమ భవిష్యత్‌ కోసం బాటలు వేసుకుంటున్నారు. అధికారపార్టీలోని మంత్రులు, ఇతర ముఖ్య నాయకులతో టచ్‌లో ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు టిడిపి ప్రయత్నం చేస్తోంది.

 కర్నూల్ జిల్లాలో టిడిపిలోకి వలసలు

కర్నూల్ జిల్లాలో టిడిపిలోకి వలసలు


కర్నూల్ జిల్లాకు చెందిన ఓ ముఖ్య వైసీపీ నాయకుడితో అధికార పార్టీ బృందం చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది. బీజేపీకి చెందిన మరో నాయకుడు టీడీపీలో చేరేందుకు మంత్రుల ద్వారా ప్రయత్ని స్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనుకొన్నట్టుగా అన్నీ సాగితే త్వరలోనే వారంతా టిడిపిలోనే చేరే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.వారం రోజుల్లో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదని టిడిపి వర్గాలు అంటున్నాయి.

వైసీపీ కీలకనేత టిడిపిలోకి

వైసీపీ కీలకనేత టిడిపిలోకి

కర్నూల్ జిల్లాలో వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వైసీపీ కీలక నాయకుడు ఒకరితో టీడీపీ బృందం రహస్య చర్యలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్‌రెడ్డిని టీడీపీ నుంచి వైసీపీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వ డం, నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా మోహన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొని టిక్కెట్‌ ఇవ్వడంలోనూ తమకు కనీస సమాచారం లేదని, పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆ నాయకుడు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.

సోమిరెడ్డితో బిజెపి కీలక నేత చర్చలు

సోమిరెడ్డితో బిజెపి కీలక నేత చర్చలు

కర్నూల్ జిల్లాలో బిజెపికి చెందిన కీలకనేత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆ బిజెపి నేత కూడ టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని సమాచారం. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఆ బిజెపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో చర్చించారు. కర్నూల్ జిల్లాలో టిడిపి కొంత బలహీనంగా ఉంది. దీంతో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలోపేతం కావాలని టిడిపి భావిస్తోంది.

2019 ఎన్నికలకు టిడిపి ప్లాన్

2019 ఎన్నికలకు టిడిపి ప్లాన్

2019 ఎన్నికలకు టిడిపి ప్లాన్ చేస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో ఎక్కువ స్థానాలను టిడిపి గెలుచుకోవాలని టిడిపి వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలోపేతం కావడానికి టిడిపి వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు అవసరమైన వ్యూహలను టిడిపి అమలు చేస్తోంది. ఈ మేరకు వలసలను ప్రోత్సహిస్తోంది.

English summary
Kurnool district Ysrcp key leader preparing to join in TDP.Tdp leaders discussed 2 times with Ysrcp leader. Another Bjp leader ready join in Tdp, He is already spoke to with minister Somireddy Chandramohan reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X