ప‌వ‌న్ హాట్ కామెంట్స్.. నా మ‌న‌సుకు క‌ర్నూలే రాజ‌ధాని : డబ్బులకు అమ్ముడు పోనూ.. జ‌గ‌న్ మాత్రం..!

ఏపి రాజ‌ధాని పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ కీలక వ్యాఖ్య‌లు చేసారు. ఏపికి అమ‌రావ‌తి రాజ‌ధాని అయినా త‌న మ‌న‌సుకు మాత్రం ఏపి రాజ‌ధాని క‌ర్నూలే న‌ని తేల్చి చెప్పారు. క‌ర్నూలు ను రాజ‌ధాని మించిన న‌గ‌రంగా నిర్మిస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. వైసిపి అధినేత జ‌గ‌న్ పైనా ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తాను డ‌బ్బుకు అమ్ముడు పోయే వ్య‌క్తి ని కాద‌ని చెప్పుకొచ్చారు.

క‌ర్నూలే రాజ‌ధాని..
క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న క‌ళ్యాన్ అక్క‌డి విద్యార్ధుల‌తో ముఖా ముఖి నిర్వ‌హించా రు. ఈరోజు మనకి రాజధాని అమరావతి అయినా.. తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని పవన్‌ వ్యాఖ్యానిం చారు. అమరావతిని మించిన నగరంగా కర్నూలును తాను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఎందరో రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయారని, తాను రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతానని చెప్పారు.

Kurnool is capital in my mind : Pawan Kalyan key comments on capital

మోసం చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం అంటే తనకు ఇష్టమని అన్నారు. డబ్బు లకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, కర్నూలును రాజధానిని మించిన నగరంగా నిర్మిస్తామని .. జనసేన ప్రభుత్వంలో మండలానికో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు.

జ‌గ‌న్ ది ప‌ర్స‌న‌ల్ గేమ్‌..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా పర్సనల్‌ గేమ్‌ప్లాన్‌ చేసుకుంటే ఎలా? అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు చట్టసభలకు వెళ్లకపోవడం వల్ల..సమస్యలు మరింత పెరుగుతున్నాయన్నారు. శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా రాష్ట్ర పర్యటన చేస్తే ఏం ప్రయోజనమని పవన్‌ ప్రశ్నించారు.

Kurnool is capital in my mind : Pawan Kalyan key comments on capital

మోసం చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం అంటే తనకు ఇష్టమని అన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్ప‌ష్టం చేసారు. తాను ఓట్లు అడగడానికి రాలేదని, మార్పు కోసమే వచ్చానన్నారు. ప్రజల సమస్యలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని చెప్పారు.‌ యువకుల్లో ప్రశ్నించే ధైర్యం ఉండాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+