వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు బాటలోనే జగన్:' ఆ స్థానాల్లో బోయలకే ఎంపీ టిక్కెట్టు, సమస్యలు పరిష్కరిస్తా'

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: 2019 ఎన్నికల్లో బోయలకు కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి ఎంపీ టికెట్‌ కేటాయిస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు.

గిడ్డి ఈశ్వరీ ఎఫెక్ట్: 2019లో పాడేరు టిక్కెట్టెవరికీ, అమరావతికి పరుగుగిడ్డి ఈశ్వరీ ఎఫెక్ట్: 2019లో పాడేరు టిక్కెట్టెవరికీ, అమరావతికి పరుగు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో స్థానికంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ ప్రసగింస్తున్నారు. ప్రధానంగా టిడిపిని దెబ్బతీసేందుకు ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది.

ట్విస్ట్: నాడు డోన్‌లో, నేడు పత్తికొండలో జగన్ ప్లాన్ ఇదే, కె.ఈ కోటాను ఢీకొట్టేనా?ట్విస్ట్: నాడు డోన్‌లో, నేడు పత్తికొండలో జగన్ ప్లాన్ ఇదే, కె.ఈ కోటాను ఢీకొట్టేనా?

2019 ఎన్నికల్లో అాదికారమే లక్ష్యంగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్‌కు అనుగుణంగా పాదయాత్రలో వరాల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానాలపై పెద్ద ఎత్తున పాదయాత్రలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

బోయలకు ఎంపీ టిక్కెట్టు

బోయలకు ఎంపీ టిక్కెట్టు

2019 ఎన్నికల్లో కర్నూల్ లేదా అనంతపురం ఎంపీ టిక్కెట్టును బోయలకు కేటాయించనున్నట్టు వైసీపీ చీఫ్ వైఎస్ జగన ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గోరంట్లలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో జగన్ ఈ మేరకు హమీ ఇచ్చారు. కర్నూల్ , అనంతపురం జిల్లాల్లో వాల్మీకి బోయ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో ఈ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకొనేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.

బాబు బాటలోనే

బాబు బాటలోనే


1998 -99 ఎన్నికల సమయంలో అనంతపురం ఎంపీ టిక్కెట్టును బోయ సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులుకు టిడిపికి కేటాయించింది. ఈ ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులు విజయం సాధించారు. దీంతో కాలువ శ్రీనివాసులును మరోసారి బరిలోకి దింపిన ఆ తర్వాత ఆయన విజయం సాధించలేదు. అయితే 2014 ఎన్నికల సమయంలో కాలువ శ్రీనివాసులు రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కూడ వాల్మీకి బోయ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు.బాబు అనుసరించిన పంథానే జగన్ కూడ అనుసరిస్తున్నారు.

బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తా

బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తా

ప్రజా సంకల్పయాత్ర అనంతరం బీసీ గర్జన ఉంటుంది. బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తానని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. చంద్రబాబు లాంటి మోసపూరిత హామీలు నేను ఇవ్వనని ఆయన చెప్పారు. బోయలకు న్యాయం చేస్తానని జగన్ హమీ ఇచ్చారు.

ప్రతి సమస్యను పరిష్కరిస్తా

ప్రతి సమస్యను పరిష్కరిస్తా

ప్రతి జిల్లాలో బీసీ కమిటీలను ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. పాదయాత్రలో నా దృష్టికొచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు.బోయలను ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అడిగితే ప్రయత్నం చేస్తున్నానంటున్నారు. రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకువచ్చి అందులో ప్రతి అక్షరాన్ని తప్పకుండా అమలు చేస్తానని జగన్ హమీ ఇచ్చారు.

English summary
Ysrcp chief said that Kurnool or Anantapur ysrcp Mp ticket to boya caste.Jagan assured to boya caste delegates in gorantla .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X