రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం మరోమారు రాజ్యసభలో ప్రస్తావనకు రానుంది. ఈ నేపథ్యంలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా కేవీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఏపీలోని మిగిలిన పార్టీల మద్దతుతో పాటు పలు జాతీయ పార్టీల మధ్దతు కూడా లభించింది. బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే మూడు దఫాలుగా రాజ్యసభలో చర్చకు వచ్చిన కేవీపీ బిల్లు పార్లమెంట్ సభా కార్యక్రమాలను స్తంభింపజేసింది. ఏపీలోని టీడీపీ, వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు కేవీపీ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇఛ్చేది లేదని తేల్చి చెప్పారు.

రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

దీంతో రాజ్యసభలో ఈ బిల్లుపై అటు విపక్షాలతో పాటు ఇటు అధికార పక్ష ఎంపీల వాదన కూడా పూర్తయింది. దీనిని బట్టి చూస్తే కేవీపీ బిల్లుపై చర్చ ముగిసినట్లే. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలింది. శుక్రవారం కేవీపీ బిల్లు ఓటింగ్ వస్తుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

ఒకవేళ రాజ్యసభలో కేవీపీ బిల్లు వచ్చినా ఓటింగ్ జరిగే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రాజ్యసభలో మనీ బిల్లు కిందకు రాని బిల్లులపై మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. అయితే కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లును అరుణ్ జైట్లీ కేవీపీ బిల్లును మనీ బిల్లుగా పేర్కొన్నారు.

రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

దీంతో కేవీపీ బిల్లుపై ఓటింగ్‌ను అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కేవీపీ బిల్లును శుక్రవారం మనీ బిల్లుగా అధికారికంగా ప్రకటించనుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్ర‌త్యేక హోదా ఆంధ్ర‌హ‌క్కు పేరిట గురువారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశం నిర్వహించింది.

 రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

రాజ్యసభకు కేవీపీ బిల్లు: ఓటింగ్‌పై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ

దీనిపై ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ కేవీపీ ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రైవేటు మెంబర్ బిల్లు శుక్రవారం రాజ్య‌స‌భ ముందుకు వ‌స్తోన్న నేప‌థ్యంలో కాంగ్రెస్ విప్ ఇచ్చింద‌ని అన్నారు. త‌మ పార్టీ ఏపీకి హోదా కోసం ఇప్పటికి రెండు సార్లు విప్ ఇచ్చిందని పేర్కొన్నారు. రేపు బిల్లు విష‌యంలో త‌మ‌కు అన్యాయం చేయొద్దని, అన్ని పార్టీలు స‌హ‌క‌రించాలని ఆయ‌న కోరారు. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను కాంగ్రెస్ కాపాడుతుంద‌ని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+