కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రేపు మధ్యాహ్నాం చర్చకు ఓకే, ఓటింగ్‌కు నో

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నాం సమావేశమైన రాజ్యసభ అఖిలపక్షం సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

హోదా రగడ: రాజ్యసభలో కేవీపీ బిల్లు, ఎవరేమన్నారు?

కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరగాలంటూ గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు సభను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యసభ పలు దఫాలుగా వాయిదా పడటం మినహా, మరే విధమైన ఇతర కార్యకలాపాలు సాగకపోవడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ నేతృత్వంలో అఖిలపక్ష నేతలు బుధవారం మధ్యాహ్నాం సమావేశమైంది.

ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలతో సమావేశమై డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ కేవీపీ బిల్లుపై చర్చించారు. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చకు మాత్రమే అనుమతిస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఏడాది తర్వాత జ్ఝానోదయమైందా: జైట్లీపై కెవిపి మండిపాటు

అయితే కాంగ్రెస్ సభ్యులు మాత్రం కేవీపీ బిల్లుపై ఓటింగ్‌కు కూడా అనుమతించాలంటూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ మెంబర్ బిల్లు మంగళవారం కూడా రాజ్యసభలో గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. బిల్లుపై ఓటింగ్ జరగాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టడంతో ఉదయం నుంచి సభ పలుమార్లు వాయిదా పడింది.

కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రాజ్యసభలో చర్చకు ఓకే

కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రాజ్యసభలో చర్చకు ఓకే

ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు.

కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రాజ్యసభలో చర్చకు ఓకే

కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రాజ్యసభలో చర్చకు ఓకే

బుధవారం ఆయన న్యూఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై గురువారం రాజ్యసభలో రెండు గంటల పాటు చర్చించాలని బీఏసీలో నిర్ణయించామని తెలిపారు.

కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రాజ్యసభలో చర్చకు ఓకే

కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రాజ్యసభలో చర్చకు ఓకే

రాజ్యసభలో చర్చ జరగనున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరుపు నుంచి ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స‌మాధానం చెబుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రాజ్యసభలో చర్చకు ఓకే

కేవీపీ బిల్లుపై దిగొచ్చిన బీజేపీ: రాజ్యసభలో చర్చకు ఓకే

మరోవైపు కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుని ద్రవ్య బిల్లుతో ఆర్ధిక మంత్రి అరుణ్ పోల్చడంతో కేవీపీ తన బిల్లును ఉపసంహరించుకోనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాను పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైనా బిల్లును ఉప‌సంహ‌రించుకోబోన‌ని ఆయన తేల్చి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress senior leader, rajya sabha mp Kvp private member bill may discuss rajya sabha on thursday 2 pm.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి