వెంకయ్యపై విసుర్లు: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కెవిపి ప్రైవేట్ బిల్లు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆయన ప్రస్తావించారు.
తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన అంశాలను పలువురు ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు సభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు గుర్తు చేశారు. విభన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు కావడంలేదని విమర్శించారు.

వీటిపై దృష్టి పెట్టకుండా కేవలం మాటలతో కేంద్రం వెల్లదీస్తుందని కేవీపీ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఎంతో డిమాండ్ చేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరిచిపోయాని ఆయన అన్నారు.
కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రెవేట్ మెంబర్ బిల్లును తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ సమర్థించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో మెలిగేలా పరిస్థితులు కల్పించాలని ఆనంద భాస్కర్ సూచించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications