ప్రధాని మోడీకి మట్టి పంపిస్తాం: కెవిపి, టెంత్ పరీక్ష.. దీక్షపై తగ్గిన ముద్రగడ
న్యూఢిల్లీ: అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి నీళ్లు, మట్టి తీసుకు వచ్చారని, ఇప్పుడు అదే మట్టిని, నీటిని కేంద్రానికి తాము ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు గురువారం ఎద్దేవా చేశారు.
విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న మట్టి సత్యాగ్రహం పైన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ మట్టి, నీటిని మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.
కేంద్రం ఇచ్చిన వాటిని మోడీ సర్కారుకు తిరిగి ఇచ్చేందుకే మట్టి సత్యాగ్రహం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీలో సేకరించిన మట్టి, నీటిని కేంద్రానికి అందించేందుకే ఆందోళనను చేపడుతున్నట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న ఆందోళనలో తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు హాజరవుతారని చెప్పారు.

దీక్ష వద్దు: ముద్రగడకు పోలీసులు
కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను తూర్పు గోదావరి జిల్లా డీఎస్సీ ఆధ్వర్యంలో పోలీసులు కలిశారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో దీక్షను వాయిదా వేయాలని ఆయనకు వారు సూచించారు.
దీనిపై ఆయన వారితో మాట్లాడుతూ... ప్రభుత్వం లేఖ పంపని పక్షంలో దీక్షకు దిగుతానని చెప్పారు. ముద్రగడ దీక్షపై ప్రకటన చేయడంతో అధికార పక్షానికి చెందిన పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు దీక్షకు దిగవద్దని సూచించారు. తాజాగా పోలీసుల సూచనను కూడా ఆయన కొట్టిపడేశారు.
దీక్ష వాయిదా వేసుకున్న ముద్రగడ
విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో దీక్షను వాయిదా వేసుకున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తాను రాజకీయ, ఆర్థిక మైలేజీ కోసం ఏదీ చేయనని చెప్పారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications