కేవీపీ ప్రయివేటు మెంబర్ బిల్లు తిరస్కరణ, మోడీ హామీ ఇచ్చారని కేవీపీ
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు రాజ్యసభలో ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు.
ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ రాజ్యసభ తిప్పి పంపింది. కేవీపీ తన బిల్లులో..

ఏపీకి మూడు ముఖ్య ప్రయోజనాలు అందించాలి. (1) 2015 -2020 మధ్య కాలంలో అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వాటాల నిష్పత్తి 90:10 ఉండాలి. కేంద్రం వాటా 90 శాతానికి చెందిన నిధులు ప్రతి ఏటా చివరిలో రాష్ట్రానికి అందించాలి.
2015-020 మధ్య కాలంలో ఏపీలో అమలయ్యే విధంగా ఒప్పందమైన అన్ని ప్రాజెక్టులలో 90 శాతం వాటాను రుణంగా కాకుండా గ్రాంటుగా ఇవ్వాలి.
ఈ అయిదు సంవత్సరాల కాలంలో ఏపీ ప్రారంభించే అన్ని పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు, ప్రత్యేక పన్ను మినహాయింపులు ఇవ్వాలి... అని కేవీపీ తన బిల్లులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రాజ్యసభలో కేవీపీ మాట్లాడారు. విభజన చట్టం హామీలను కేంద్రం అమలు చేయాలన్నారు. విభజన చట్టం సవరణకు తాను ప్రతిపాదించిన ప్రయివేటు బిల్లును రాజ్యసభ సెక్రటరియేట్ తిప్పి పంపారన్నారు. ఎన్నికల సమయంలో తిరుపతిలో ప్రధాని మోడీ ఏపీకి హోదా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications