ఏపీలో లారీలు ఆపి ఆయుధాలతో అర్దరాత్రి మహిళా అఘోరీ హల్చల్!
సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయం పైన దుండగులు దాడి అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ అఘోరి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రధాన ఆలయాలన్నీ తిరుగుతూ వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే వచ్చింది. శ్రీకాళహస్తిలో బట్టలు లేకుండా దర్శనానికి వెళ్తానని సిబ్బందితో గొడవకు దిగింది.
ఎక్కడికి వెళ్ళినా అఘోరీ హల్చల్
తనను దర్శనానికి వెళ్ళనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ డబ్బా పట్టుకుని హల్చల్ చేసింది. ఇక అక్కడ ఆలయ సిబ్బంది మహిళా అఘోరీకి నచ్చజెప్పి బట్టలు వేసుకుని దర్శనం చేసుకోవాలని చెప్పడంతో అక్కడ గొడవ సద్దుమణిగింది. ఇక ఆ తర్వాత వేములవాడలో కత్తి తీసుకొని పలువురిని భయపెట్టింది.

లారీ డ్రైవర్ల పై విరుచుకుపడిన అఘోరి
పోలీసులు రంగ ప్రవేశం చేసి మళ్లీ అఘోరికి నచ్చచెప్పి పంపించారు. ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్న అఘోరి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హల్చల్ చేసింది. తాజాగా నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ల పై విరుచుకుపడిన అఘోరి చిల్లకూరు మండలంలో టోల్ ప్లాజా వద్ద ఎద్దుల లోడ్ తో వెళుతున్న మూడు లారీలను అడ్డగించింది.
ఆయుధం పట్టుకొని అఘోరీ రచ్చ
వాహనాలను ఆపి హల్చల్ చేసిన అఘోరి మూడు వాహనాలలో ఎద్దులను తీసుకెళ్తున్న క్రమంలో సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకువెళ్లాలని వారిపైన మండిపడింది. వారు తాము రైతులమని చెప్పినా వినకుండా రచ్చ చేసింది. కత్తులు, శూలాలతో అఘోరీ హల్చల్ చేసింది. చెన్నై నుండి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో అఘోరి ఒక ఆయుధం పట్టుకొని లారీ డ్రైవర్లపై విరుచుకుపడడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అఘోరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అఘోరీకి నచ్చజెప్పిన హిజ్రాలు
ఎంతకీ అఘోరి చెప్పింది వినకపోవడంతో స్థానిక హిజ్రాలను అఘోరితో మాట్లాడాలని చెప్పారు. దీంతో వారు అఘోరితో మాట్లాడి అక్కడ నుంచి పంపించడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నారు. ఏది ఏమైనా అఘోరి ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా సెన్సేషన్ క్రియేట్ చేయడం మాత్రం మామూలు అయిపోయింది.












Click it and Unblock the Notifications