చంద్రబాబే పిలిచారు: భేటీపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పిలిచారని, అందుకే తాను వచ్చానని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అంతేగాక, తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. నంద్యాల ఉపఎన్నికల అనంతరం తాను ఎలాంటి సర్వేలు చేయలేదని లగడపాటి తెలిపారు. అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, గతంలోనూ లగడపాటి రాజగోపాల్.. సీఎం చంద్రబాబును సమావేశం అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాను ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో లేనంటూ లగడపాటి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications