రాజకీయం లేదా: విశాఖకొచ్చి గంటాని కల్సిన లగడపాటి
విశాఖపట్నం: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం విశాఖపట్నం వచ్చి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాస రావును కలిశారు. విశాఖ వచ్చి గంటాను లగడపాటి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
దీనిపై లగడపాటి మీడియాతో మాట్లాడారు. తమ భేటీలో రాజకీయం ఏమీ లేదన్నారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు విశాఖపట్నం వచ్చానని చెప్పారు. గంటా శ్రీనివాస రావు మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించడంతో మర్యాదపూర్వకంగా వచ్చానన్నారు.

తాజా రాజకీయ పరిస్థితులు, ఓటింగ్ సరళి తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నట్టుగా సమాచారం. కాగా, ఇటీవల లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ఫలితాల పైన తన అంచనాలు చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications