తల పట్టుకోవాలి: లగడపాటి, జెపిని టార్గెట్ చేసిన మిత్రా
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎందుకు పెట్టామా? అని బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెసు పార్టీ తల బాదుకునేలా చేస్తామని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఆదివారం చెప్పారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఇటీవల తాము కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసం కేవలం ట్రయలర్ మాత్రమే అన్నారు. విభజన విషయంలో కేంద్రం అలాగే ముందుకెళ్తే ఢిల్లీలో వేడి పుట్టించాల్సిందేనన్నారు. ఢిల్లీలో ఆందోళనల కోసం తాము ముప్పై, నలభై రైళ్లలో ఢిల్లీకి వెళ్తామని లగడపాటి చెప్పారు.

టార్గెట్ జెపి
తెలంగాణ ఏర్పాటు అవసరం, అనివార్యం అని చెప్పిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయ ప్రకాశ్ నారాయణ పైన సమైక్యవాదులు మండిపడుతున్నారు. సమైక్యవాదులు, ఎపిఎన్జీవో, తెలుగు ప్రజా వేదిక కన్వీనర్ డాక్టర్ మిత్రా జెపిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీమాంధ్రకు ప్యాకేజీ అడుగుతున్న జెపికి కేంద్రం వద్ద నిధులు లేవని తెలియదా అని మిత్రా ప్రశ్నించారు. మెజార్టీ లేకుండా విభజన అనడం దురదృష్టకరమన్నారు. విభజన అవసరం ఎందుకో జెపి చెప్పాలని నిలదీశారు. రెచ్చగొట్టిన తెలంగాణ ఉద్యమానికి జెపి మద్దతు పలకడమేమిటని ప్రశ్నించారు. జెపి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ప్రజా వేదిక దీక్షకు దిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా త్వరలో రేపు అసెంబ్లీని ముట్టడిస్తామని సమైక్యాంధ్ర ఐకాస హెచ్చరించింది. లోక్‌సత్తా పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. 23వ తేదీ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.
కాగా, శాసన మండలిలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఆదివారం చర్చ జరిగింది. మండలిలో ఆరుగురు సీమాంధ్ర మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు పాల్గొనలేదు. ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గ్యాలరీలో కూర్చొని చర్చను విన్నారు. అనంతరం మండలి సోమవారానికి వాయిదా పడింది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications