వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల‌గ‌డ‌పాటి స‌ర్వే సిద్దం..ఈ సాయంత్ర‌మే: ఏపీలో గెలిచేదెవ‌రు టీడీపీనా...వైసీపీయా: టీజ‌ర్ రెడీ ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Exit Polls 2019 : ల‌గ‌డ‌పాటి స‌ర్వే సిద్దం.. ఈ సాయంత్ర‌మే ఫ‌లితాలు వెల్ల‌డి..!!

ఆంధ్రా ఆక్టోప‌స్ వ‌చ్చేసారు. ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర్వేల‌తో సిద్ద‌మైపోయారు. వాస్త‌వంగా 19వ తేదీ సాయంత్రం వ‌ర‌కు స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డి చేయ‌టానికి ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు ఉన్నాయి. కానీ, ల‌గ‌డ‌పాటి ఈరోజు సాయంత్ర‌మే అమ‌రావ‌తితో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో ఏపీ స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డిస్తారా..లేక తెలంగాణ త‌ర‌హాలో తొలుత టీజ‌ర్ విడుద‌ల చేస్తారా..ఏపీలో ఎవ‌రికి అనుకూలంగా చెప్పుబోతున్నారు..

ఈ సాయంత్రమే ల‌గ‌డ‌పాటి..

ఈ సాయంత్రమే ల‌గ‌డ‌పాటి..

ఆంధ్రా అక్టోప‌స్..మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఈ సాయంత్రం మీడియా ముందుకు వ‌స్తున్నారు. ఎప్పుడూ త‌న స‌ర్వేల ఫ‌లితాల‌తో ప్ర‌జ‌ల్లో ఇమేజ్ తెచ్చుకున్న ఆయ‌న‌..తెలంగాణ ఫ‌లితాల అంచనా స‌మ‌యంలో దెబ్బ తిన్నారు. ఇక‌, ఏపీ ఫ‌లితాల‌తో పాటుగా జాతీయ రాజ‌కీయాల గురించి మే 19న సాయంత్రం స‌ర్వే వివ‌రాలు ప్ర‌క‌టిస్తాన‌ని గ‌తం లోనే ల‌గ‌డ‌పాటి ప్ర‌క‌టించారు. అయితే, అనూహ్యంగా ఈ సాయంత్ర‌మే అమ‌రావ‌తిలో ల‌గ‌డ‌పాటి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసారు. 19న ప్ర‌క‌టించాల్సిన స‌ర్వే ఫ‌లితాలు ఈ రోజే ప్ర‌క‌టించ‌టానికి ఎన్నిక‌ల సంఘం అనుమ‌తించే అవ‌కాశం లేదు.రేపు ఏపీలోనూ రీ పోలింగ్ ఉంది. దీంతో..నేరుగా ఫ‌లితాలు ప్ర‌క‌టించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నా.. ఆయ‌న ఏపీలో ఫ‌లితాల గురించి టీజ‌ర్ త‌ర‌హాలో త‌న స‌ర్వే హైలైట్స్ వివ‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీని ద్వారా ఏపీలో ఫ‌లితాలు ఏర‌కంగా ఉంటాయో సంకేతాలు ఇచ్చే ఛాన్స్ ఉంది.

తెలంగాణ‌లోనూ ఇదే త‌ర‌హాలో..

తెలంగాణ‌లోనూ ఇదే త‌ర‌హాలో..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల స‌మ‌యంలోనూ ల‌గ‌డ‌పాటి ఇదే విధంగా చేసారు. ఎన్నిక‌ల్లో ఫ‌లితాల అంచ‌నాలు అంటూ ముందుగానే త‌న అభిప్రాయ‌ల‌ను మీడియాలో షేర చేసుకున్నారు. తొలుత స్వ‌తంత్ర అభ్య‌ర్దులు గెలుస్తార‌ని చెప్ప‌టంతో ప్రారంభించి..ఆ త‌రువాత టీఆర్‌య‌స్‌కు వ్య‌తిరేకంగా ఫ‌లితాలు ఉంటాయంటూ విశ్లేష‌ణ‌లు చేసారు. వీటి పైన అప్ప‌ట్లోనే టీఆర్‌య‌స్ నేత‌లు ల‌గ‌డ‌పాటి పైన మండిప‌డ్డారు. తెలంగాణ ఫ‌లితాలు ల‌గ‌డ‌పాటి అంచ‌నాల‌కు పూర్తి భిన్నంగా వ‌చ్చాయి. ఆ త‌రువాత కొద్ది రోజులు స్పందించ‌ని ల‌గ‌డ‌పాటి త‌రువాకి కాలం లో తెలంగాణ ఫ‌లితాలు ఎందుకు త‌ప్పాయో చెబుతాన‌ని వివ‌రించారు. ఇక‌, ఈ రోజు సాయంత్రం ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి త‌న అభిప్రాయ‌ల‌ను వెల్ల‌డించ‌టంతో పాటుగా తెలంగాణ‌లో త‌న అంచ‌నాలు ఎందుకు త‌ప్పాయో వివ‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఏపీలో ఎవ‌రి వైపు మొగ్గు..

ఏపీలో ఎవ‌రి వైపు మొగ్గు..

ఉత్కంఠ క‌లిగిస్తున్న ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి ఈ సాయంత్రం ల‌గ‌డ‌పాటి సంకేతాలు ఇచ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల పైన చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఆయ‌న అంచ‌నాల‌ను స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో అమెరికాలో జ‌రిగిన ఎన్నారైల స‌మావేశంలో పాల్గొన్న ల‌గ‌డ‌పాటి ఏపీలో ప్ర‌జ‌లు సంక్షేమం..అభివృద్దికి మ‌ద్ద‌తుగా నిలిచార‌ని వ్యాఖ్యానించారు. దీని ద్వారా పరోక్షంగా టీడీపీ గెలుస్తుంద‌నే సంకేతాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. ఇక‌, ఈ సాయంత్రం మీడియా స‌మావేశంలోనూ ఆయ‌న చెప్పే విశ్లేష‌ణ‌ల మీద ఆసక్తి నెల‌కొని ఉంది. టీడీపీకే మ‌ద్ద‌తుగా ఆయ‌న స‌ర్వే ఉంటుంద‌ని..అయితే, ఫ‌లితాలు మాత్రం ఖ‌చ్చితంగా త‌మ‌కే అనుకూలంగా ఉంటాయ‌ని వైసీపీ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది. ఇప్ప‌టికే తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఇరుకున ప‌డిన ల‌గ‌డ‌పాటి ఏపీ విష‌యంలో ఏం చేస్తారో చూడాలి...

English summary
ex MP Lagdapati Rajagopal Redy to reveal AP Assembly Exit polls to day evening in Amaravati. Already Lagadapati indicated that public vote for Development and Welfare. To day evening Lagadapati called media conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X