జైల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు జడ్ ప్లస్ భద్రతకు నో

బిర్సా ముండా జైలు సూపరింటెండెంట్ ధర్మేంద్ర పాండే మాట్లాడుతూ... తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించిందని తెలిపారు.
జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ క్యాట్ కమాండోస్ రక్షణ ఉంటుంది. లాలూ ఎక్కడికైనా వెళ్లితే ముప్పై మంది కమాండోలు ఆయన వెంట ఉంటారు. లాలూకు బ్లాక్ కమాండోస్ నిత్యం రక్షణగా ఉంటారు.
దాణా కుంభకోణంలో అరెస్టైన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బిర్సా ముండా జైలులో ఉన్నారు. ఆయనను అక్టోబర్ 3వ తేదిన సిబిఐ ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, జైలు శిక్ష ఖరారు చేయనుంది.












Click it and Unblock the Notifications