గూగుల్ డేటా సెంటర్ కోసం చంద్రబాబు ప్రభుత్వం కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని అనంతపురం మండలం తుర్లవాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. google డేటా సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 308.657ఎకరాల భూమిని కేటాయిస్తోంది. ఈ భూములను ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో సేకరించి google కు కేటాయించనున్నారు.
భూసేకరణకు ప్రభుత్వం ప్రకటించిన ధర
ఇందులో 204 ఎకరాల వరకు డి పట్టా , శివాయ్ జమేదార్, రికార్డుల్లోకి ఎక్కని శివాయ్ జమేదార్ భూములు ఉన్నాయి. ముందుగా డీ పట్టా భూములకు ఎకరానికి 17 లక్షల రూపాయలు, రికార్డుల్లోకి ఎక్కని శివాయ్ జమేదార్ భూములకు ఎనిమిదిన్నర లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ విలువను నిర్ణయించారు.

రైతుల డిమాండ్ తో ఆ భూముల ధరల పెంపు
రైతులు తమకు ఆ ధర గిట్టుబాటు కాదని ధర పెంచాలని డిమాండ్ చేయడంతో రైతుల డిమాండ్ మేరకు డి పట్టా భూములకు ఎకరానికి 20 లక్షల రూపాయలు, శివాయ్ జమేదార్ భూములకు ఎకరానికి 10 లక్షల రూపాయలు ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు తమ భూమికి బదులుగా 20 సెంట్ల భూమిని తుర్లవాడ సమీపంలో కేటాయించాలని, మిగతా భూమికి పరిహారం నగదు రూపంలో ఇవ్వాలని కోరారు.
గూగుల్ డేటా సెంటర్ కు భూములు ఇవ్వటానికి ముందుకొస్తున్న రైతులు
దీంతో ప్రభుత్వం ఈ డిమాండ్ కు అంగీకారం తెలపడంతో రైతులు గూగుల్ డేటా సెంటర్ కు భూమిని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికి 60 శాతం మందికి పైగా రైతులు అంగీకార పత్రాలను సమర్పించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలను గురించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు అధికారులు రైతులకు తెలియజేస్తున్నారు.
వారికి పరిహారం ఇలా
డేటా సెంటర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధరకు రెండున్నర రెట్లు, ఇక రికార్డుల్లోకి ఎక్కని శివాయ్ జమేదార్ రైతులకు నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం జమ అవుతుంది. భూములు ఇచ్చిన రైతులకు మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం, ఫలసాయం కోల్పోయిన కుటుంబాలకు వాణిజ్య సముదాయం నిర్ణయం నిర్మించి వ్యాపారాలు చేసుకునే సదుపాయం కల్పించడానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారు.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రభుత్వం కృతనిశ్చయం
అయితే 3 సెంట్లకు బదులు 5 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం google డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో కృతనిశ్చయంతో ఉండడంతో భూసేకరణ కోసం రైతులకు ఇబ్బంది లేకుండానే నిర్ణయం తీసుకుని, సంతోషంగా రైతులు భూములు ఇచ్చేలా ప్రయత్నం చేస్తోంది.












Click it and Unblock the Notifications