వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం వద్ద మళ్ళీ కుంగిన భూమి .. భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు

|
Google Oneindia TeluguNews

ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగిపోయిన ఘటన చోటుచేసుకుంది.గతంలోనూ పలుమార్లు ప్రాజెక్టు సమీపంలో భూమి కుంగిపోవటంతో ప్రాజెక్టు నిర్మాణం పై ఆందోళనతో పాటు అనుమానాలు రేకెత్తాయి. ప్రాజెక్టు సమీప ప్రాంతాలలో భూమిలో వస్తున్న మార్పుల నేపథ్యంలో భూమి కుంగిపోతున్నట్లుగా భావిస్తున్న సమీప గ్రామాల ప్రజలు,ఇలాంటి చోట ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా ఉంటుందనే ఆందోళనకు లోనవుతున్నారు.

తాజాగా నేడు పాత సీనయ్య కంపెనీ సమీపంలో భూమి పొంగి పోతుందని కలకలం రేగింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే భారీ వాహనాల తిరగటం కారణమని అధికారులు చెబుతున్నారు. కానీ అధికారులు చెప్పిన సమాధానానికి ప్రజలు మాత్రం ఏమాత్రం అంగీకరించలేక పోతున్నారు. ఇక గతంలో పలుమార్లు భూమి పైకి లేవడం, కుంగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక ఒకసారి భూమి ఏకంగా 60 అడుగుల పైకి లేవడం, మరల కుంగిపోవడం కూడా జరిగింది.

Land collapse at Polavaram again .. People of nearby villages in panic

ఇక అంతే కాదు తాజాగా ఏపీలో భూకంపాల ప్రభావం ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో నేడు మరోమారు భూమి కుంగిపోయింది అన్న వార్తలు స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి.పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏఫీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న క్రమంలో ఇక్కడ ప్రస్తుతం నిర్మాణ పనులు కూడా జరగటం లేదు. ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వ వెళ్లి త్వరలో పనులు చేపట్టనుంది .

ఇక పోలవరం సమీపంలోని ఏజెన్సీ గ్రామాలకు చెందిన వారు తాజాగా కుంగుబాటుకు గురవుతున్నఈ రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్నారు.ఇప్పటికే చాలా సార్లు కుంగిపోతున్నా దీనిపై అధ్యయనం చెయ్యటం లేదని , అధికారులు సరియైన చర్యలు తీసుకోవటం లేదని తెలుస్తుంది. భారీ ప్రాజెక్టు స్పిల్ వే జరుగుతున్న ప్రదేశానికి దగ్గరగా ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Land collapse at the Polavaram project is a matter of concern. Residents of nearby villages, who feel the land is shrinking due to changes in the land near the project, are worried about how the project will be built in such a place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X