ఏపీలో ఉద్యోగులకు బకాయిలకు బదులు భూమి ? షాకింగ్ ప్రతిపాదన..!

ఏపీలో ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు కలిపి 35 వేల కోట్ల బకాయిలు పెట్టాయి. ఇందులో డీఏ, పీఆర్సీ, జీఎల్ఐతో పాటు ఇతర బకాయిలు కూడా ఉన్నాయి. వీటిని చెల్లించాలని ఉద్యోగులు పదే పదే కోరుతున్నా, ఉద్యమాలు చేస్తున్నా, పండగలు వచ్చి పోతున్నా ప్రభుత్వాల్లో కదలిక మాత్రం ఉండట్లేదు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో, ఇప్పుడు కూటమి సర్కార్ హయాంలోనూ అదే పరిస్దితి. దీంతో ఉద్యోగుల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది.

బకాయిలకు బదులు భూమి

రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిల్ని పదే పదే అడిగే పరిస్దితి, వాటి కోసం ఉద్యమాలు చేసే పరిస్దితి లేకపోవడంతో ఉద్యోగులు చేసేది లేక ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన ప్రతిపాదన ఇప్పుడు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. అదేమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విలువైన భూమిని ఉద్యోగులకు ఇవ్వడం.

Land for Dues AP Employees Association s Bold and Surprising Offer to State Government

ప్రభుత్వానికి ఉద్యోగుల ప్రతిపాదన

ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో ఉద్యోగులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిల చెల్లింపు కోసం తగిన నిధులు కేటాయించాలని, లేకపోతే వాటి స్ధానంలో ఉద్యోగులకు భూమిని ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరుతోంది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, కార్యదర్శి రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ కు ప్రతిపాదనలు ఇచ్చారు.

Land for Dues AP Employees Association s Bold and Surprising Offer to State Government

బకాయిలు అసాధ్యం కాబట్టే భూమి

అలాగే ఈ నెలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాలని వారు నిర్ణయించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సిన బాకీలు 35 వేల కోట్లకు చేరుకున్నాయని, వీటిని చెల్లించలేని పరిస్దితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందున, వాటి స్ధానంలో భూమిని ఇవ్వాలని ప్రతిపాదించినట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు చెప్తున్నారు. దీంతో పాటు వెంటనే పీఆర్సీని కూడా నియమించాలని కూడా వారు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+