భూములేమైనా.. నీ అత్త సొత్తా?: బాబుపై జగన్, పోర్టు రైతులకు పరామర్శ(పిక్చర్స్)
కృష్ణా: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహనరెడ్డి ఏపి సిఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమల పేరిట బలవంతపు భూసేకరణ జరుపుతున్నారని మండిపడ్డారు. బందరు పోర్టు బాధిత రైతుల పరామర్శలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా బందరు మండలం పెదకరగ్రహారం, తుమ్మలచెరువు, పొట్లపాలెం గ్రామాల్లో బుధవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోర్టు పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలను కాజేసి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని దుమ్మెత్తిపోశారు. అసైన్డ్ భూములను తన అత్త సొత్తుగా చంద్రబాబు భావిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల సాకుతో రైతులను రోడ్డుపాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.

వైయస్ జగన్
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహనరెడ్డి ఏపి సిఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

వైయస్ జగన్
పరిశ్రమల పేరిట బలవంతపు భూసేకరణ జరుపుతున్నారని మండిపడ్డారు.

వైయస్ జగన్
బందరు పోర్టు బాధిత రైతుల పరామర్శలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా బందరు మండలం పెదకరగ్రహారం, తుమ్మలచెరువు, పొట్లపాలెం గ్రామాల్లో బుధవారం పర్యటించారు.

వైయస్ జగన్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోర్టు పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలను కాజేసి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని దుమ్మెత్తిపోశారు.

వైయస్ జగన్
అసైన్డ్ భూములను తన అత్త సొత్తుగా చంద్రబాబు భావిస్తున్నారని మండిపడ్డారు. ఒకసారి రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములను పరిశ్రమల పేరుతో వెనక్కి తీసుకోవాలని అనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.

వైయస్ జగన్
పరిశ్రమల సాకుతో రైతులను రోడ్డుపాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.

వైయస్ జగన్
భూసేకరణ చట్టాన్ని తమకనుకూలంగా మలుచుకునేందుకు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన కేంద్రం, రైతుల వ్యతిరేకతకు వెనక్కి తగ్గాల్సి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

వైయస్ జగన్
కేంద్ర ప్రభుత్వమే వెనక్కి తగ్గినప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మురిగిపోనున్న ఆర్డినెన్స్‌ను ఆధారంగా తీసుకుని బందరు పోర్టు, పరిశ్రమల స్థాపనకై అర్ధరాత్రి పూట 30వేల ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం అనైతికమని అన్నారు.

వైయస్ జగన్
చట్టపరంగా నోటిఫికేషన్ ఏమాత్రం చెల్లుబాటు కాదని అన్నారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమి కూడా సేకరించే దమ్ము, ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని చెప్పారు.

వైయస్ జగన్
రైతులు అధైర్యాన్ని వీడి తమ భూముల కోసం ధైర్యంగా పోరాడాలని సూచించారు.

వైయస్ జగన్
రైతుల ఆందోళనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. పెద్దఎత్తున ధర్నాలు చేయాలని సూచించారు. అవసరమైతే బంద్‌కు పిలుపునివ్వాలన్నారు.
భూసేకరణ చట్టాన్ని తమకనుకూలంగా మలుచుకునేందుకు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన కేంద్రం, రైతుల వ్యతిరేకతకు వెనక్కి తగ్గాల్సి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వమే వెనక్కి తగ్గినప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మురిగిపోనున్న ఆర్డినెన్స్‌ను ఆధారంగా తీసుకుని బందరు పోర్టు, పరిశ్రమల స్థాపనకై అర్ధరాత్రి పూట 30వేల ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం అనైతికమని అన్నారు.
చట్టపరంగా నోటిఫికేషన్ ఏమాత్రం చెల్లుబాటు కాదని అన్నారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమి కూడా సేకరించే దమ్ము, ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని చెప్పారు. రైతులు అధైర్యాన్ని వీడి తమ భూముల కోసం ధైర్యంగా పోరాడాలని సూచించారు.
రైతుల ఆందోళనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. పెద్దఎత్తున ధర్నాలు చేయాలని సూచించారు. అవసరమైతే బంద్‌కు పిలుపునివ్వాలన్నారు. ప్రభుత్వ మెడలు వంచైనా భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేలా వైయస్సార్ కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాడుతోందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications