మాసాయిపేట: మృత్యుంజయుడు వరుణ్ (పిక్చర్స్)
హైదరాబాద్: 36 రోజులుగా ఆస్పత్రి పడకపై ఉండి, వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న వరుణ్ మృత్యువును జయించాడు. మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్ పూర్తిగా కోలుకున్నాడు.
గురువారం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యాడు. తల్లి ఒడిలో ఒదిగిపోయాడు. ఇదే ప్రమాదంలో గాయపడి ఇదివరకే ఇంటికి వెళ్లిన అక్కయ్య రుచితతో కలిసి ఇంటికి వెళ్లాడు.
వరుణ్ వయసు ఏడేళ్లు. గత నెల 24న జరిగిన మాసాయిపేటలో రైలు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన 20 మంది విద్యార్థులను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకువచ్చారు. అందులో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మిగిలిన 18 మందిని వైద్యులు కాపాడారు.

వరుణ్
గాయపడ్డ వారిలో వరుణ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు మొదట్లోనే ప్రకటించారు.

వరుణ్
వరుణ్‌ను బతికించడం కష్టమనే నిర్ధారణకు వైద్యులు వచ్చారు. ఈ ప్రమాదంలో వరుణ్ పై మెదడు, మెదడు కింది భాగం, మధ్యభాగంలో బలమైన గాయాలయ్యాయి.

వరుణ్
ముఖ్యమైన మధ్య మెదడు చాలా చితికిపోయింది. ఛాతీపై గాయాలయ్యాయి. చర్మ మంతా గీసుకుపోయింది. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే వరుణ్‌లో కదలిక లేదు. చూపు లేదు.

వరుణ్
దీంతో వరుణ్ గొంతుకు రంధ్రం చేసి వెంటిలేటర్ చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలో పలు మార్లు ఫిట్స్ వచ్చాయి. కొన్నిసార్లు రోజుకు ఇరవైసార్లు ఫిట్స్ వచ్చాయి.

వరుణ్
ఇక వరుణ్‌ను బతికించడం కష్టమని వైద్యులు భావించారు. అప్పటికీ పట్టు వదలకుండా చికిత్సలో మార్పులు చేస్తూ వచ్చారు. వైద్యుల కృషి ఫలించడంతో ఫిట్స్ తగ్గి వరుణ్ సాధారణ స్థాయికి చేరుకున్నాడు.

వరుణ్
వరుణ్ ఇప్పుడు అన్నం తినగలుగుతున్నాడని, తన పనులను తా ను చేసుకుంటున్నాడని, అందరినీ గుర్తుపడుతున్నాడని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య చెప్పారు.

వరుణ్
ఇంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడిపితే అతని ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని వైద్యులు వివరించారు. కాగా, మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన విద్యార్థులకు తమ ఆస్పత్రికి చెందిన మూడు శాఖల వైద్యులు కృషి చేశారని మెడికల్ సూపరింటెండెంట్ లింగయ్య చెప్పారు.

వరుణ్
మొత్తం 50 మంది వైద్యులు, 100 మంది నర్సులు, మరో 100 మంది సాంకేతిక, పారా మెడికల్, ఇతర సిబ్బంది వైద్య చికిత్సలో పాల్గొన్నారన్నారు. విద్యార్థుల చికిత్స కోసం ఏడు వెంటిలేటర్లు, ఆక్సిజన్ పరికరాలు, లంగ్ ఫంక్షన్ పరికరాలను వినియోగించినట్లు చెప్పారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications