Survey: కడప, అనంతపురం జిల్లాలపై తాజా సర్వే ..! ఎడ్జ్ ఎవరికంటే?

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అధికార కూటమి పార్టీలకూ, విపక్ష వైఎస్సార్సీపీ మధ్య గట్టి పోటీ ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ రెండు పక్షాల మధ్య పలు చోట్ల గట్టి పోటీ నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల పాలన తర్వాత కూటమి సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఇందుకు ఓ కారణం. అయినా కూటమి ఏకపక్షంగా విజయాలు సాధిస్తామని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలోని రెండు ప్రధాన జిల్లాల్లో తాజాగా నిర్వహించిన సర్వే (Survey) ఫలితాలు వచ్చాయి.

ఈసీ ప్రకటనపై చంద్రబాబు కీలక ట్వీట్- జగన్ కు భిన్నంగా అనూహ్య స్టాండ్..!
ఈసీ ప్రకటనపై చంద్రబాబు కీలక ట్వీట్- జగన్ కు భిన్నంగా అనూహ్య స్టాండ్..!

కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని పేరున్న రైజ్ సర్వే సంస్ద వ్యవస్ధాపకుడు ప్రవీణ్ పుల్లట స్ధానిక సంస్ధల ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా రాయలసీమలోని వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఆయన తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎడ్జ్ ఉందనే విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆయా జిల్లాల్లో తాజా పరిస్దితి ఎలా ఉందన్న దానిపై పార్టీలు ఓ అంచనాకు వచ్చేందుకు వీలు కలుగుతోంది.

Latest Survey How Are YSRCP and NDA Positioned in Kadapa Anantapur districts
Palle Panduga 3.0:
Palle Panduga 3.0:

ప్రవీణ్ పుల్లట తన రైజ్ సంస్ధ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో ముందుగా అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వానికి రెడ్ జోన్ అలర్ట్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అట్టర్ ఫ్లాప్ అని, ఇంకా శింగనమల, తాడిపత్రి, గుంతకల్ ఎమ్మెల్యేలు హై రిస్క్ జోన్ లో ఉన్నారని ఆయన తన సర్వేలో వెల్లడించారు. మొత్తంగా కూటమి ఇక్కడ పట్టు కోల్పోతుందని సర్వేలో తెలిపారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లాలో చూస్తే.. బద్వేలు, పులివెందులలో వైసీపీ సేఫ్ గా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే కడప, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు కూటమి ఎమ్మెల్యేలకు హై అలర్ట్ ఇచ్చారు. అంటే వారు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇక్కడ కూటమి ఓడిపోతుందనేది ఆయన అంచనాగా తెలుస్తోంది. త్వరలో మిగతా జిల్లాల సర్వే వివరాలు కూడా ప్రకటించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+